పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లతో పసిడి, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.225 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుత ధర రూ.38,715కు చేరింది.
కిలో వెండి ధర (దిల్లీలో) నేడు ఏకంగా రూ.440 పెరిగి.. రూ.45,480 వద్ద ఉంది. రూపాయి విలువ క్షీణించడం, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనుమానాలూ.. ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,461 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 16.90 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: మొండి బకాయిలకు కారణం 'కొత్త కుర్రోళ్లే'..!