పండుగ సీజన్ నేపథ్యంలో పసిడి ధర మళ్లీ రూ.39 వేలకు చేరువవుతోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు ఒక్క రోజే రూ.177 వృద్ధితో.. రూ.38,932కి చేరింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయ సానుకూలతలతో ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
బంగారం బాటలోనే వెండి ధరలు పయనించాయి. దిల్లీలో కిలో వెండి ధర నేడు రూ.290 పెరిగి.. రూ.46,560 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,493 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.57 వద్ద ఉంది.
ఇదీ చూడండి: బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్పై కేంద్రం వరాల జల్లు