నూతన సంవత్సరం ప్రారంభంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.131 తగ్గి రూ.39 వేల 818గా ఉంది. కిలో వెండి ధర రూ.590లు తగ్గి రూ.47 వేల 655కు చేరింది.
దిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.131 తగ్గడం వెనుక రూపాయి విలువ స్వల్పంగా పెరగడమే కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ (కమొడిటీస్) అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
రూపాయి కొత్త సంవత్సరం ప్రారంభంలో సానుకూలంగా ట్రేడైంది. సుమారు 7 పైసలు పెరిగి, డాలరుకు రూ.71.29గా ఉంది.
ఇదీ చూడండి: 2020కి స్టాక్ మార్కెట్ల శుభారంభం