పసిడి ధర నేడు స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 క్షీణించింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుత ధర రూ.38,550కి చేరింది.
కిలో వెండి ధర (దిల్లీలో) నేడు స్వల్పంగా రూ.90 తగ్గి.. రూ.45,080 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ఔన్సు బంగారం ధర 1,453 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 16.81 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్ సంసిద్ధం!