ETV Bharat / business

ఔషధ పరిశ్రమపై కరోనా పడగ

చైనాలో పుట్టిన కరోనా వైరస్​ మన దేశంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపుతోంది. ముడి ఔషధాల కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడిన ఫార్మా పరిశ్రమ మరింత భయపడుతోంది. వైరస్​ నేపథ్యంలో చైనా నుంచి బల్క్, ఏపీఐ ఔషధాల దిగుమతులు భారీగా తగ్గుతున్నాయి. ఫలితంగా ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌ తయారీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు దేశీయ కంపెనీల వద్ద ముడి ఔషధాల నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇకపైనా వైరస్‌ విస్తరిస్తే ఔషధ రంగానికి గడ్డు కాలమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

corona effect on farma industry
ఔషధ పరిశ్రమపై కరోనా పడగ
author img

By

Published : Feb 8, 2020, 7:20 AM IST

Updated : Feb 29, 2020, 2:37 PM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. వివిధ పర్రిశమలను కలవరపరుస్తోంది. ముడి ఔషధాల కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడిన ఫార్మా పరిశ్రమ మరింత భయపడుతోంది. మందుల తయారీకి అవసరమైన పలు ముడి పదార్ధాలను ఇక్కడి ఫార్మా కంపెనీలు చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. వీటిని ఇక్కడి ఫార్మా కంపెనీలు తుది వినియోగానికి అనువైన ట్యాబ్లెట్లు, కేప్సుల్స్‌గా తయారు చేస్తున్నాయి. దాదాపు దేశీయ అవసరాల్లో 60-80 శాతం వరకూ చైనా నుంచి వస్తున్నవే. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఫార్మా కంపెనీలు సుమారు రూ.17,000 కోట్ల విలువైన బల్క్‌, ఏపీఐ ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ఇక్కడి ఫార్మా కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అక్కడి నుంచి మన అవసరాలకు తగ్గట్లుగా ముడి ఔషధాలు రావటం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గత కొంతకాలంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఔషధ పరిశ్రమ విస్తరించింది. ఈ నగరాలకు దగ్గర్లో ఏర్పాటైన ఔషధ యూనిట్లు పలు దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాయి. బల్క్‌ ఔషధాలు ఇక్కడ సొంతంగా తయారు చేసుకోవటం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకోవటం చౌక కావటం దీనికి ప్రధాన కారణం. గత కొంతకాలంగా చైనాలో పారిశ్రామిక కాలుష్యం బాగా పెరిగింది. దీంతో కాలుష్య నిబంధనలను అక్కడ కఠినతరం చేశారు. తత్ఫలితంగా రెండు, మూడేళ్ల నుంచి బల్క్‌ ఔషధాలు, ఏపీఐలు చైనా నుంచి రావటం తగ్గింది. ఎప్పటికీ ఇది సమస్యే కాబట్టి దేశీయంగానే బల్క్‌ ఔషధాల తయారీని పెంచాలని అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమ వర్గాలు మాట్లాడుతున్నాయి. కానీ ఆ దిశగా గట్టి అడుగులు పడటం లేదు. దేశంలో నాలుగైదు ప్రదేశాల్లో బల్క్‌ ఔషధ పార్కులు ప్రారంభించాలని, అందుకు ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇవ్వాలని ఫార్మా పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆ కసరత్తు ఇంకా పట్టాలెక్కక ముందే ఇప్పుడు కరోనా వైరస్‌ సమస్యతో బల్క్‌ ఔషధాల సమస్య తీవ్రతరంగా మారింది.

కరోనా వైరస్‌ సమస్యతో చైనా నుంచి బల్క్‌, ఏపీఐ ఔషధాల సరఫరా ఏమేరకు తగ్గుతుందనే విషయంలో ఈ నెల 10 తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్ధానిక ఔషధ కంపెనీ అధిపతి 'ఈనాడు'కు వివరించారు. చైనాలో క్రిస్మస్‌, కొత్త సంవత్సర సెలవులు ఈ నెల 10 వరకూ పొడిగించారు. సెలవులు ముగిశాక అక్కడి నుంచి ఏ మేరకు మనకు అవసరమైన బల్క్‌, ఏపీఐ ఔషధాలు సరఫరా అవుతాయనేది తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైతే కొరత అంత కనిపించటం లేదు..., కానీ ఇదే సమస్య ఎక్కువ కాలం కొనసాగితే తీవ్రమైన ఇబ్బందులు తప్పవు, మందుల ధరలు కూడా పెరిగిపోతాయి- అన్నారాయన.

ఇదీ సమస్య తీవ్రత...

  • చైనాలోని వుహాన్‌, ఝెజియాంగ్‌, జియాంగ్సు తదితర నగరాలకు సమీపంలో బల్క్‌ డ్రగ్స్‌, ఏపీఐలు అధికంగా తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు కరోనా వైరస్‌ ఫలితంగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి.
  • విటమిన్లు, యాంటీ-బయాటిక్స్‌ తయారీలో వినియోగించే ఎన్నో ముడి ఔషధాలకు మనకు చైనా మీద అధికంగా ఆధారపడవలసిన పరిస్థితి ఉంది. గత రెండు మూడు వారాలుగా చైనా బల్క్‌ ఔషధాల దిగుమతులు క్షీణించాయి. మున్ముందు ఇంకా తగ్గొచ్చు.
  • పెన్సిలిన్‌-జీ, పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌, మాంటెలుకాస్ట్‌.. తదితర ఔషధాల తయారీకి ముడి ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.
  • దేశీయ ఫార్మా కంపెనీల వల్ల ఉన్న ముడిపదార్థాల నిల్వలు 2, 3 నెలల అవసరాలకు మాత్రమే సరిపోతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి లోగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టని పక్షంలో ముడి ఔషధాల ధరలు పెరిగి, పలు రకాల మందుల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కల్లోలమే!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని లండన్‌ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ సమాచార సంస్థ ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ పేర్కొంది. 2003లో సార్స్‌ (సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) కంటే కరోనా వల్ల కలిగే దుష్ఫలితమే అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ వైరస్‌ తీవ్రత, మరణాలు ఎక్కువగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తే, ప్రపంచ ఆర్థికంపై ప్రకంపనలు ఏర్పడతాయని విశ్లేషించింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 16.3 శాతం కాగా, 2019 ప్రపంచ జీడీపీ వృద్ధిలో చైనా వాటా 38 శాతమని, అందువల్ల ఆ దేశంలో మాంద్యం ఏర్పడితే, అది ప్రపంచంపైనే దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రస్తుత నిర్బంధాలు ఫిబ్రవరి వరకే అయితే, ప్రపంచ జీడీపీ తొలి త్రైమాసికంలో 0.8 శాతం, రెండో త్రైమాసికంలో 0.5 శాతం తగ్గుతుందని అంచనా వేసింది.

జర్మనీ-ఫ్రాన్స్‌ల బెంబేలు

ఫ్రాంక్‌ఫర్ట్‌: ప్రపంచ వాణిజ్య యుద్ధాల వల్ల 2019లో పారిశ్రామిక ఉత్పత్తి నెమ్మదించి ఇబ్బంది పడిన జర్మనీ, ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థలను ఇప్పుడు కరోనా వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. ఈ ఏడాది వ్యవస్థలు పునరుత్తేజితం అవుతాయని ఆశిస్తుంటే, ఈ వైరస్‌ ప్రతికూలంగా మారిందని భావిస్తున్నారు. జర్మనీ కార్ల ప్లాంట్లకూ చైనా నుంచి విడిభాగాలు సరఫరా అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ కార్యకలాపాలు నిలపాల్సిందే.

అతిపెద్ద కార్ల ప్లాంటు మూసివేత

కరోనా దెబ్బకి దక్షిణ కొరియాతోపాటు మరిన్ని దేశాల్లో కార్ల కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల కోసం చైనాపై ఆధారపడటమే ఇందుకు కారణం.

  • ఏడాదికి 14 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంటుగా ప్రఖ్యాతి గాంచిన ఉల్‌సాన్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టులో శుక్రవారం కార్యకలాపాలు నిలిపేసినట్లు హ్యుందాయ్‌ తెలిపింది. ఇందువల్ల 25,000 మంది కార్మికులకు బలవంతంగా సెలవు ఇవ్వడంతో పాటు, వేతనాల్లో కోత విధిస్తున్నారు. ఈ ప్లాంటును 5 రోజుల పాటు నిలిపేస్తే, సంస్థపై సుమారు రూ.3500 కోట్ల భారం పడుతుంది.
  • కియా కూడా సోమవారం నాడు 3 ప్లాంట్లు మూసివేయనుంది. ఫ్రెంచ్‌ వాహన దిగ్గజం రెనో కూడా బుసాన్‌లోని ప్లాంటును వచ్చేవారం నిలిపేయనుంది.

ఇదీ చదవండి: దిల్లీ దంగల్: ఓటింగ్​కు సర్వం సిద్ధం.. మరికొద్ది గంటల్లో పోలింగ్ ​

ZCZC
PRI ESPL NAT NRG
.CHANDIGARH DES19
PB-TIKTOK-GOLDEN TEMPLE
Akal Takht mulling ban on mobile phones inside Golden Temple
         Chandigarh, Feb 7 (PTI) Banning mobile phones inside the Golden Temple complex will have to be "thought over" if visitors continue to click selfies and shoot TikTok videos inside the holiest Sikh shrine, Jathedar of the Akal Takht, the top temporal body of Sikhs, Giani Harpreet Singh said on Friday.
          TikTok is a short-video platform which is extremely popular among youngsters globally, including India. Owned by China-based ByteDance, it has about 200 million users in India.
         "We want all devotees to visit the Golden Temple without any hassle and we are not in favour of imposing any such (mobile) ban but the way the incidents of TikTok are surfacing, I think imposing ban on carrying mobile phones inside (Golden Temple) will have to be pondered over in the future," Singh told reporters in Amritsar.
         The Jathedar (head priest) also pointed out that some of the devotees even argue with 'sewadars' (workers) upon being stopped from clicking photos inside the premises.
         "It is a very serious problem," said the Jathedar advising devotees to refrain from doing such acts.
         Photography and videography in the precincts of the Golden Temple have already been banned by the Shiromani Gurdwara Parbandhak Committee (SGPC) to avoid any "disturbance" to the spiritual atmosphere.
         Notice boards in the marbled periphery of the Sikh shrine, prohibiting devotees to click photos and make videos, have also been installed. However, devotees continue to take selfies with the Golden Temple in the background.
         The Jathedar's statement comes two days after a TikTok video shot inside the Golden Temple by three girls with a Punjabi song playing in the background went viral on social media.
         A police complaint was lodged to identify the girls.
         It was the second such incident in a short span of time as in January, a police complaint was lodged against a girl for hurting religious sentiments of Sikhs after she shot a dance video inside the Darbar Sahib complex.
         Later, the girl had to apologise.
         Meanwhile, endorsing the views of the Akal Takht Jathedar, SGPC chief Gobind Singh Longowal said strict action was needed to stop people from making TikTok videos in the precincts of the Golden Temple.
         "We will have to take strict action if such incidents do not stop," said Longowal.
         He said more SGPC workers would be deployed to prevent devotees from making videos inside the Golden Temple complex.
         "We will also discuss this issue in the upcoming meeting of the executive committee of the SGPC on February 12," said Longowal. PTI CHS SUN
RHL
02071738
NNNN
Last Updated : Feb 29, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.