ETV Bharat / business

మొండి బకాయిలకు కారణం 'కొత్త కుర్రోళ్లే'..! - cibil score

కార్పొరేట్​ సంస్థలకు ఇస్తున్న భారీ రుణాలు వలనే బ్యాంకింగ్​ రంగంలో మొండి బకాయిల సమస్య తలెత్తుతోందని ట్రాన్స్‌యూనియన్‌- సిబిల్‌ నివేదికలో తెలిపింది. ఈ మేరకు ఆర్​బీఐ బ్యాంకులపై కఠిన విధానాలు విధించింది. ఫలితంగా కార్పొరేట్ సంస్థల​కు రుణాలు ఇవ్వడాన్ని తగ్గించి రిటైల్​ రుణాలపై దృష్టి సారించాయి బ్యాంకులు.

ముందుచూపు లేకుండా మిలినీయన్ల రుణాలు!
author img

By

Published : Nov 13, 2019, 12:40 PM IST

గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్‌ రంగాన్ని మొండి బకాయిల సమస్య వేధిస్తోంది. కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన భారీ రుణాలే ఇందుకు ప్రధాన కారణం. ఆర్‌బీఐ కఠిన విధానాలు అమలు పరచడం వలన బ్యాంకులు ఆచితూచి రుణాలిస్తున్నాయి. మొండి బకాయిలపై కేటాయింపులు చేయడం లేదా రద్దు చేయడం వల్ల బ్యాంకులు ఎన్‌పీఏలను తగ్గించుకుంటూ వస్తున్నాయి.

నష్టభయం అధికంగా ఉండటం వలన కార్పొరేట్‌ రుణాలివ్వడాన్ని తగ్గిస్తున్న బ్యాంకులు.. రిటైల్‌ రుణాలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మిలీనియల్స్‌ (1980 తర్వాత పుట్టినవారు)ను లక్ష్యంగా చేసుకుని బ్యాంకులు ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారొచ్చని, ఇవి మొండి బకాయిలుగా మారే అవకాశం లేకపోలేదని ఒక నివేదిక హెచ్చరించింది. కొత్త రుణాలు తీసుకుంటున్న మిలీయనల్స్‌ సంఖ్య 58 శాతం పెరగ్గా, మిగతా వారి సంఖ్య 14 శాతం మాత్రమే పెరిగిందని ట్రాన్స్‌యూనియన్‌- సిబిల్‌ అధ్యయనం స్పష్టం చేసింది.

నివేదికలోని పలు అంశాలు ఇలా..

రుణాల వృద్ధి కోసం బ్యాంకులు రిటైల్‌ రుణాలపై అధికంగా ఆధారపడుతున్నాయి. కార్పొరేట్‌ విభాగంతో పోలిస్తే నష్టభయం తక్కువగా ఉన్నప్పటికీ.. బ్యాలెన్స్‌ షీట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మిలీనియల్స్‌ ఆర్థిక వ్యయాలపై సైతం ఆందోళనలు పెరుగుతున్నాయి. పొదుపు చేసే వారి సంఖ్య తగ్గడం వల్ల జాతీయ పొదుపు రేటు క్షీణించడానికి దారితీస్తోంది.

మిలీనియల్స్‌ రుణ అవసరాలను 72 శాతం క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు, వినియోగ వస్తువుల రుణాలు తీరుస్తున్నాయి. భద్రత కలిగిన ద్విచక్ర వాహనాలు, కారు రుణాల వాటా 9 శాతంగా మాత్రమే ఉంది.

క్రెడిట్​ స్కోరుపై దృష్టి

క్రెడిట్‌ స్కోరుపై మాత్రం వీరు చాలా అప్రమత్తతంగా ఉంటున్నారు. 900కు గాను సగటు 740 నిలబెట్టుకోవడంపై దృష్టి పెడుతున్నారు. గుజరాత్‌కు చెందిన మిలీనియల్స్‌కు అత్యధిక సగటు క్రెడిట్‌ స్కోరు 747గా ఉంది. హరియాణా 743, రాజస్థాన్‌ 742 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర - కొనసాగనున్న పార్టీల చర్చలు!

New Delhi, Nov 12 (ANI): Chief Minister of Delhi, Arvind Kejriwal visited Gurdwara Rakab Ganj Sahib in Delhi on the occasion of Guru Nanak Jayanti to offer prayers on November 12. He was accompanied by Yoga guru Ramdev and Shiromani Akali Dal (SAD) MLA Manjinder Singh Sirsa. "Guru Nanak Dev Maharaj taught us to live in peace and spread love," Kejriwal said while talking to media persons.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.