ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఇకపై రోజుకు 24 గంటలు చొప్పున, పూర్తి వారం పాటు 'ఎన్ఈఎఫ్టీ' లావాదేవీలు జరుపుకొనే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్‌టెల్.
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌పై ఇటీవలే ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమ వినియోగదారులు ఏ సమయంలోనైనా 'ఎన్ఈఎఫ్టీ' చేసుకునేలా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాట్లు చేసింది. బ్యాంకు వినియోగదారులు... ఎయిర్‌టెల్ థ్యాంక్స్ గివింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి ఈ సేవలు వినియోగించుకోవచ్చునని తెలిపింది.
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను జనవరి 2017లో ఏర్పాటు చేశారు. భారత్‌లో ఇదే తొలి పేమెంట్స్ బ్యాంక్. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు దాదాపు 4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
ఇదీ చూడండి: ఆ పథకంలో చేరితే పెన్షన్ రెట్టింపు?