ETV Bharat / business

'అరవింద' సమేత అమెరికా కంపెనీలు..! - సత్య నారాయణ నాదెళ్ల

ప్రపంచంలోనే పేరెన్నికగన్న దిగ్గజ కంపెనీల సీఈఓలుగా పలువురు భారతీయులు రాణిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్​, అడోబ్​ లాంటి సంస్థలను అద్భుతంగా నడుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం... మన వారి పని సంస్కృతి, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, సృజనాత్మకత వంటి లక్షణాలు టెక్‌ దిగ్గజాలను ఆకర్షించడమే.

A look at 10 international companies headed by Indian origin CEOs
'అరవింద' సమేత అమెరికా కంపెనీలు..!
author img

By

Published : Feb 4, 2020, 2:44 PM IST

Updated : Feb 29, 2020, 3:35 AM IST

'ద ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌’.. ముద్దుగా ఐబీఎం అని పిలుచుకునే టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంటే ఎంతో ముందుగానే ఏర్పాటైంది. ఒకప్పుడు కంప్యూటర్లు అంటే ఐబీఎంవే. కానీ, దీనిలో పనిచేసిన ఒక ఉద్యోగి వేరుపడి ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పుడు ఐబీఎంను దాటేసింది. ఆ ఉద్యోగే బిల్‌గేట్స్‌.. ఆ సంస్థపేరు మైక్రోసాఫ్ట్‌.

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఒక వెలుగు వెలిగిన మైక్రోసాఫ్ట్‌ ఆ తర్వాత షేర్‌ హోల్డర్లను సంతృప్తి పర్చలేకపోయింది. మొబైల్‌ విప్లవం.. ఆండ్రాయిడ్‌ రాకతో కొంత వెనుకపడింది. దీంతో ఈ కంపెనీ పగ్గాలను మన తెలుగు వాసి సత్యనాదెళ్లకు అప్పగించారు. ఫలితంగా కంపెనీ వ్యాపారం మళ్లీ పుంజుకొని దూసుకెళుతోంది. ఇప్పుడు ఐబీఎం వంతు వచ్చింది. సీఈఓ వర్జీనియా గిన్ని రొమెట్టి(62) నేతృత్వంలో ఈ సంస్థ ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఇప్పుడు కంపెనీ పగ్గాలను మరో ఆంధ్రుడు అరవింద్‌ కృష్ణాకు అప్పగించాలని నిర్ణయించింది.

సిలికాన్‌ వ్యాలీలో కంప్యూటర్‌ విప్లవానికి కారణమైన రెండు కీలక సంస్థలకు భారతీయులు.. అందులో మన తెలుగువారు నాయకత్వం వహించడం విశేషం. అంతేకాదు అమెరికాలో జీవనాడుల్లాంటి అతిపెద్ద కంపెనీల్లో పదింటికి మన భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా కంపెనీలను భారతీయులు ఆకర్షించడానికి కారణం ఉంది. మన వారి పని సంస్కృతి, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, సృజనాత్మకత వంటి లక్షణాలు టెక్‌ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి.

భారతీయులు నాయకత్వం వహిస్తున్న దిగ్గజ కంపెనీలు ఇవే..

  • అడోబ్‌- శంతను నారాయణన్‌
  • ఆల్ఫాబెట్‌, గూగుల్‌- సుందర్‌ పిచాయ్‌
  • మైక్రోసాఫ్ట్‌- సత్య నారాయణ నాదెళ్ల(సత్య నాదెళ్ల)
  • నోకియా - రాజీవ్‌ సూరి
  • డెలాయిట్‌ - పూనిత్‌ రంజన్‌
  • నోవార్టిస్‌ - వసంత్‌ నరసింహన్‌ (వస్‌)
  • మాస్టర్‌ కార్డ్‌ - అజయ్‌ పాల్‌ సింగ్‌ బంగా
  • డియా జియో - ఇవాన్‌ మాన్యూయల్‌
  • వేఫెయిర్‌ - నీరజ్‌ ఎస్‌. షా
  • మైక్రాన్‌ - సంజయ్‌ మెహ్రోత్రా
  • నెట్‌ యాప్‌ - జార్జి కురియన్‌
  • పాల్‌ ఆల్టో నెట్‌వర్క్‌ - నిఖేష్‌ అరోరా
  • హర్మాన్‌ ఇంటర్నేషనల్‌ ఇండస్ట్రీస్‌ - దినేష్‌ సి పాలివాల్‌
  • ఐబీఎం - అరవింద్‌ కృష్ణా (ఏప్రిల్‌6 నుంచి)
  • వుయ్‌వర్క్‌ - సందీప్‌ మత్రాని (ఫిబ్రవరి 18 నుంచి)

కీలకమైన ఈ కంపెనీల్లో భారతీయులు సీఈఓల స్థాయికి చేరడానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబలైజేషన్‌కు అమెరికా సమాజం నిలువెత్తు రూపం. పలు దేశాల ప్రజలు.. జాతుల వారు అక్కడ స్థిరపడి దేశాభివృద్ధికి కృషి చేశారు. ఈ ట్రెండ్‌ ముఖ్యంగా బహుళజాతి కంపెనీల్లో కనబడుతుంది.

గతంలో పెప్సీకి ఇంద్రా నూయి.. సిస్కోలో పద్మశ్రీవారియర్‌ కూడా కీలక స్థానాల్లో పనిచేశారు. కోకాకోలా వంటి కంపెనీలను ఎదుర్కోంటూ పెప్సీని ప్రపంచస్థాయికి చేర్చడంలో ఇంద్రా నూయి పాత్ర వెలకట్టలేనిది. కంపెనీ కష్టకాలంలో భారతీయులు బాగా పనిచేస్తారనే పేరు తీసుకురావడానికి ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. భారతీయులను సీఈవోలుగా ఎంచుకోవడానికి కారణాలను నిపుణులు విశ్లేషించారు..

సమాజంలో ఒడుదొడుకులు ఎదుర్కొని..

భారత్‌ 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం. ఇక్కడ డజన్ల కొద్దీ భాషలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి విషయంలో విపరీతమైన పోటీని ఎదుర్కొని గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారే సామాజిక రాజకీయ పరిస్థితులు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. దీంతో ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. వాస్తవ పరిస్థితులను అంగీకరించే మనస్తత్వాన్ని ఏర్పర్చుకుంటారు. ఈ క్రమంలో భారీగా పోటీని ఎదుర్కొని గెలిచేందుకు సృజనాత్మకత, ఓపికగా ఎదురు చూసే తత్వం వారు అలవర్చుకుంటారు. దీంతో కార్పొరేట్‌ బ్యూరోక్రసీలో వీరు మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది.

కత్తికి రెండువైపులా పదును పెడతారు..

భారతీయులకు ముందుచూపు చాలా వ్యూహాత్మకంగా ఉంటుందనే పేరుంది. భారతీయులు సమాచారం సేకరించడంలో మాస్టర్లు. వారు ఆ సమాచారాన్ని ఒక వ్యూహం ప్రకారం సిద్ధం చేస్తారు. అది పనిచేయకపోతే ఏమి చేయాలో కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొంటారు. సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వుయ్‌వర్క్‌ భవిష్యత్తు సీఈఓ మాత్రాని ఇలాంటి వ్యూహాలనే వివరించి ఆశ్చర్యపర్చాడు.

పక్కాగా లెక్కలేసి..

సగటు భారతీయుడు 100 కోట్లమందిలో పోటీపడాలంటే ప్రతిదానికి లెక్కలు పక్కాగా ఉండాలి. భారతీయులు స్కూల్లో నర్సరీ నుంచి ఐఐటీలో సీట్ల వరకు ఎలా సాధించాలనేది ముందే లెక్కలు వేసుకొని వ్యూహాత్మకంగా ముందుకుసాగుతారు. ఈ లక్షణం కంపెనీలను ఒడుదొడుకులకు గురికానీయదు.. సుందర్‌ పిచాయ్‌, అరోరా, కృష్ణ వారంతా ఐఐటీల్లో చదువుకొని వచ్చినవారే. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు రావాలంటే ఏ స్థాయిలో కృషి చేయాలో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

చదువులో చురకత్తులే..

అమెరికాకు వలస వచ్చిన వారిలో భారతీయులకు విద్యావంతులుగా పేరుంది. పీఈడబ్ల్యూ రీసెర్చి సెంటర్‌ లెక్కల ప్రకారం 2016 నాటికి 77శాతం మంది భారతీయులు బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఆపై చదువులను పూర్తి చేశారు. అమెరికాలో పుట్టిన వారిలో ఈ శాతం 31.6 మాత్రమే. స్థానికుల కంటే వీరే ఎక్కువగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితానికి సంబంధించిన కోర్సులు చేస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో పెద్ద,చిన్న కంపెనీలకు ఈ స్కిల్స్‌ కచ్చితంగా అవసరం.

కుటుంబ అనుబంధాలు..

భారత్‌లో కుటంబ బంధాలు బలంగా ఉంటాయి. ఇటువంటి బంధాలను ఉద్యోగులు కంపెనీలతో పెంచుకొనేలా చూస్తారు. పెప్సీ కో సీఈఓగా ఇంద్రా నూయి ఎంపికైనప్పుడు పలువురు ఆమె తల్లిదండ్రులను అభినందించారు. దీనిని గుర్తుపెట్టుకున్న నూయి పెప్సీలో అద్భుతంగా పనిచేసిన ఎగ్జిక్యూటివ్‌ల తల్లిదండ్రులకు కృతజ్ఞతులు చెబుతూ ఉత్తరాలు రాశారు. ఇటువంటి చర్యలు ఉద్యోగుల కుటుంబాలను కంపెనీలకు దగ్గర చేస్తాయి.

వైవిధ్యం కోసం..

మంచి నాయకత్వం ఉంటే మరింత ప్రేరణతో పనిచేస్తామని చాలా మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. డెలాయిట్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ వైవిధ్యంగా ఉంటే.. పని వాతావరణం స్ఫూర్తితో ఉంటుందని 69 శాతం మంది అభిప్రాయపడ్డారు. భిన్నమైన వాతావరణం నుంచి వచ్చినవారు తమను తాము నిరూపించుకోవడానికి బాగా కష్టపడతారు.

ప్రతిభకు విలువ ఇవ్వడం..

వలస వచ్చిన వ్యక్తిని ప్రతిభ ఆధారంగా సీఈఓగా నియమించడం అత్యంత అరుదైన పని. కానీ, అమెరికా వృద్ధిలోనే వలసవచ్చిన వారి పాత్ర ఉంది. ఇక్కడ ప్రతిభావంతులకు అవకాశాలు ఇస్తారు. ముఖ్యంగా కంపెనీల్లో ఇన్వెస్టర్లు, మార్కెట్లు సీఈఓలను బట్టే అంచనాలు కడుతుంటాయి. అందుకే ప్రతిభ ఉన్నవారికి ఇక్కడ పట్టం కడుతుంటారు.

ఇదీ చూడండి: సుందర్​కు షాక్​: ఆల్ఫాబెట్​కు లాభాలొచ్చినా నిరాశే

Last Updated : Feb 29, 2020, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.