ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రాకెట్ దాడిపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీం సోలేమనీని మట్టుబెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారని ఆ దేశ రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. విదేశాల్లోని అమెరికా పౌరుల రక్షణకు నిర్ణయాత్మక భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
"ఇరాక్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అమెరికా దౌత్యవేత్తలపై దాడి చేసేందుకు జనరల్ సోలేమనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వందలాది అమెరికా పౌరులు, భాగస్వామ్య సేవల విభాగాల సభ్యుల మరణాలకు జనరల్ సోలేమనీ, అతని బృందమే కారణం. అంతే కాదు వారు వేలాదిమందిని గాయపరిచారు."
- అమెరికా రక్షణ విభాగం, పెంటెగాన్
తాజాగా బాగ్దాద్ రాకెట్ దాడుల్లో సోలేమనీ మృతి చెందిన క్రమంలో.. అమెరికా జాతీయ జెండాను ట్వీట్టర్లో పోస్ట్ చేశారు అధ్యక్షుడు ట్రంప్.
ఇదీ చదవండి:నేడు, రేపు కేంద్ర మంత్రిమండలి కీలక భేటీ!