ఫ్రెంచ్ ఓఫెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరు ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ తైజు యింగ్ చేతిలో పరాజయం పాలైంది. 16-21, 26-24, 17-21 తేడాతో తీవ్రంగా పోరాడి ఓడింది.
తొలి గేమ్‌లో తైజుకి పోటీనిచ్చిన సింధు.. ఆ తర్వాత ఆకట్టులేకపోయింది. ఫలితంగా తొలి సెట్ కోల్పోయింది. హోరాహోరిగా సాగిన రెండో సెట్లో సింధు నెగ్గింది. ఆరంభంలో ఆధిక్యంలోకి వెళ్లింది సింధు. అయితే అనూహ్యంగా పుంజుకున్న తైజు స్కోరు సమం చేయడమే కాక 20-19తో గెలుపు ముంగిట నిలిచింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ గేమ్‌ను చివరికి సింధు 26-24తో గెలుచుకుని మ్యాచ్‌లో నిలిచింది.
ఆఖరి గేమ్‌లో సింధు పోరాడినా.. తైజు మాత్రం పట్టు వదల్లేదు. విరామ సమయానికి 11-9తో నిలిచిన తైజు.. ఆ తర్వాత 21-17తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది.
సైనా ఔట్..
మరో క్వార్టర్స్‌లో 8వ సీడ్ సైనా 20-22, 21-23తో 16వ ర్యాంకర్ ఆన్ యంగ్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసి ఇంటిముఖం పట్టింది. గాయం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన 7వ సీడ్ సైనా... ఈ సూపర్ 750 టోర్నీలో గట్టి ప్రత్యర్థులైనా చెంగ్ న్యాన్ యి (హాంకాంగ్), లియానే (డెన్మార్క్)లను ఓడించింది. దీనికన్నా ముందు పాల్గొన్న మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌కే పరిమితమైంది.
క్వార్టర్స్‌లో సాత్విక్ - చిరాగ్ జోడీ
సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ జోరు కొనసాగుతోంది. మరో సంచలన విజయంతో ఈ జంట పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ 21-13, 22-20తో ప్రపంచ 8వ ర్యాంకు జోడీ కిమ్ అస్ట్రప్-ఆండ్రెస్ రస్‌ముసెన్ (డెన్మార్క్)లకు షాకిచ్చారు.
ఇదీ చదవండి: టీ10 లీగ్‌కు పాక్ దూరం.. ఆటగాళ్లకు ఆదాయం కట్!