ప్రధాని నరేంద్ర మోదీ ఈ తెల్లవారుజామున సౌదీ అరేబియా చేరుకున్నారు. రెండు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్న మోదీ.... ఉన్నత స్థాయి వార్షిక ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం గల్ఫ్ రాజ్యాల దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
విలువైన మిత్రదేశంతో సంబంధాలను పటిష్ఠ పరుచుకునే దిశగా ఇదో కీలక పర్యటన అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఫ్యూచర్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఇన్షియేటివ్ సదస్సులో...భారత్‌కు తర్వాత ఏంటి అనే అంశంపై ప్రసంగించనున్నారు. దీనితో పాటు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సహా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
చమురు, గ్యాస్, పునరుత్పాదక శక్తి, పౌర విమానయానం వంటి రంగాల్లో.... ఈ సందర్భంగా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ, సౌదీ యువరాజు బిన్ సల్మాన్ నేతృత్వంలో.. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: నేడు కశ్మీర్‌కు ఈయూ ఎంపీలు.. ప్రతిపక్షాల విమర్శలు