బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(243; 330 బంతుల్లో) ద్విశతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే డబుల్ సెంచరీ పూర్తయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న విరాట్ వైపు రెండు వేళ్లు చూపిస్తూ.. ద్విశతకాన్ని గుర్తు చేశాడు మయాంక్. ప్రతిగా కోహ్లీ చిరునవ్వుతో మూడు వేళ్లు చూపిస్తూ.. ట్రిపుల్ సెంచరీ కొట్టాలన్నట్లు సంజ్ఞలు చేశాడు.
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ద్విశతకం (215) బాదిన మయాంక్ ఆ తర్వాతా అదే జోరు కొనసాగించాడు. చివరి నాలుగు టెస్టుల్లో 215, 7; 108; 200*తో చెలరేగాడు. రెండో డబుల్ సెంచరీ చేయడానికి మయాంక్ తీసుకున్నది కేవలం 12 ఇన్నింగ్స్‌లే కావడం విశేషం.
అయితే బంగ్లాతో మ్యాచ్‌లో త్రిశతకం చేయాలన్న కసితో భారీ సిక్సర్లు బాదడం మొదలు పెట్టిన మయాంక్ వ్యక్తిగత స్కోరు 243 వద్ద ఔటయ్యాడు. మెహదీ హసన్ వేసిన 107వ ఓవర్ మూడో బంతికి అబు జాయేద్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇదీ చదవండి: బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్