ETV Bharat / bharat

లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు​

మధ్యప్రదేశ్​లోని మంద్​సౌర్ టిక్‌టాక్‌ వీడియో రూపకల్పన కోసం ఇద్దరు యువకులు తుపాకీ కొనుగోలు చేశారు. ద్విచక్ర వాహనంపై తుపాకీతో టిక్‌టాక్‌ వీడియో రూపకల్పన కోసం అక్రమ మార్గంలో ఆయుధాన్ని కొన్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కువ లైక్‌లు పొందేందుకు ఇలా చేశామని యువకులు సమాధానమిచ్చారు.

టిక్​టాక్ కోసం తుపాకి కొన్న యువకులు
author img

By

Published : Nov 20, 2019, 11:59 AM IST

టిక్టాక్‌ వ్యసనంతో యువత వింత పోకడలను అనుసరిస్తోంది. టిక్‌టాక్‌లో ఎక్కువ లైక్‌లు పొందేందుకు ఇద్దరు యువకులు చేసిన చర్య వారిని కటకటాల పాలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లా మాల్హాఘర్‌కు చెందిన రాహుల్, కన్హయ్య టిక్‌ టాక్‌లో వీడియోలను రూపొందించేందుకు 25 వేల రూపాయలు చెల్లించి అక్రమ మార్గంలో తుపాకీ కొనుగోలు చేశారు.

టిక్​టాక్ కోసం తుపాకి కొన్న యువకులు-అరెస్టు చేసిన పోలీసులు!

అనంతరం బైక్‌పై వెళ్తూ టిక్‌టాక్‌ వీడియో రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారి.. పోలీసుల దృష్టికి వెళ్లింది.

విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక సైబర్ బృందం సామాజిక మాధ్యమాలను నిత్యం పర్యవేక్షిస్తుందని, యువత అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని మంద్‌సౌర్‌ జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: జాతీయ పౌర జాబితాపై 'యూఎస్​సీఐఆర్​ఎఫ్' ఆందోళన!

Bhubaneswar (Odisha), Nov 20 (ANI): Veteran actor and Makkal Needhi Maiam chief Kamal Haasan was conferred an honorary doctorate for his contribution to cinema, on November 19 in Bhubaneswar. Chief Minister of Odisha, Naveen Patnaik, presented the doctorate degree to Haasan at an event. The event was organised by Odisha's Centurion University of Technology and Management. "I am very honoured that they have chosen me. I am made of various skills that my Guru taught me," Hassan told media persons.

For All Latest Updates

TAGGED:

tiktok video
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.