టికెట్టు తీసుకోవడానికి నిరాకరించిన ఓ విద్యార్థినిని.. కండక్టర్ బలవంతంగా బయటకు నెట్టేసిన దారుణ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన కండక్టర్ శివశంకర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
ఇదీ జరిగింది..
పీయూసీ చదువుతున్న ఓ విద్యార్థిని బస్సు ఎక్కింది. కండక్టర్ శివశంకర్ టికెట్ తీసుకోమని ఆమెను కోరాడు. అయితే బస్సు పాస్ తన వద్ద ఉందని, టికెట్ తీసుకోనని ఆమె చెప్పింది. దీనితో ఆగ్రహం వక్తం చేసిన శివశంకర్.. ఆమెను బస్సు దిగాలని గదమాయించాడు. తరువాతి బస్సు స్టేషన్లో దిగుతానని విద్యార్థిని చెప్పింది. అయినా వినిపించుకోకుండా ఆమెను బలవంతంగా బస్సు నుంచి బయటకు తోసేశాడు. ఫలితంగా విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధం: రజనీ, కమల్