ETV Bharat / bharat

'ఆ భూమి మాకిస్తే మరో రామమందిరాన్ని నిర్మిస్తాం' - అయోధ్య కేసు

సున్నీ వక్ఫ్​ బోర్డు నిర్ణయాలను దేశంలోని అందరి ముస్లింలకు ఆపాదించవద్దని అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు పేర్కొంది. అయోధ్య వివాదంలో లభించిన 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని సున్నీ బోర్డు స్వీకరిస్తే.. అది దేశంలోని ముస్లిం సమాజం నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ఆ భూమి తమకిస్తే మరో రామమందిరాన్ని నిర్మిస్తామని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది.

UP-AYODHYA LAND-SHIA
UP-AYODHYA LAND-SHIA
author img

By

Published : Feb 5, 2020, 3:29 PM IST

Updated : Feb 29, 2020, 6:51 AM IST

సున్నీ వక్ఫ్​ బోర్డుకు 5 ఎకరాల భూమిని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం కేటాయించటంపై అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు (ఏఐఎంపీఎల్​బీ) స్పందించింది. సున్నీ వక్ఫ్ బోర్డు ఆ భూమిని స్వీకరిస్తే.. ఆ నిర్ణయం దేశంలోని ముస్లింలందరి అభిప్రాయం కాదని స్పష్టం చేసింది.

"దేశంలోని ముస్లిం సమాజానికి సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి కాదు. ఆ భూమిని బోర్డు స్వీకరిస్తే.. అది అందరి ముస్లింల అంగీకారం కాదు. ఏఐఎంపీఎల్​బీ, సంబంధిత వర్గాలు అయోధ్యలోని ఏ భూమిని స్వీకరించకూడదని నిర్ణయించాం. "

-మౌలానా యాసిన ఉస్మానీ, ఏఐఎంపీఎల్​బీ సభ్యుడు

మరో ఆలయం నిర్మిస్తాం: షియా వక్ఫ్ బోర్డు

సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన భూమిని తమకు ఇస్తే మరో రామమందిరాన్ని నిర్మిస్తామని ఉత్తర్​ప్రదేశ్​ షియా వక్ఫ్ బోర్డు తెలిపింది.

"షియాకు చెందిన మిర్​ బాఖీ.. మసీదును నిర్మించిన వ్యక్తి. కానీ పరిహారంగా భూమి మాత్రం సున్నీలకు వెళ్లింది. ఇది పూర్తిగా షియాల తప్పే. తమ గళం వినిపించి ఉండాల్సింది. మాకు ఆ భూమిని ఇస్తే అక్కడ మరో రామమందిరాన్ని నిర్మిస్తాం."

- వాసీం రిజ్వీ, యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్​

కేబినెట్​ ఆమోదం

సున్నీ వక్ఫ్​ బోర్డుకు ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చే ప్రతిపాదనకు ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్​ ఆమోదం తెలిపింది. అయోధ్యకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపుర్​ అనే గ్రామంలో ఐదెకరాల భూమిని బోర్డుకు కేటాయించింది. ఈ ప్రతిపాదనకు ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.

మొదట కేంద్రానికి 3 ప్రాంతాలను ఎంపిక చేసి పంపింది యూపీ ప్రభుత్వం. వీటిని పరిశీలించి అయోధ్య నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపుర్​లోని భూమికి.. కేంద్రం ఆమోదం తెలిపింది. రవాణా వ్యవస్థతో పాటు భద్రత పరంగా అనువైన ప్రదేశం కావటం వల్ల కేంద్రం ధన్నీపుర్​ వైపు మొగ్గు చూపింది కేంద్రం.

Intro:Body:

ram mandir breaking

Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.