పెళ్లినాట ఏడు అడుగులు నడిచి, జీవితాంతం తోడుగా ఉంటా అని ప్రమాణం చేసి... దాదాపు 50 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంది ఆ జంట. చివరికి చావులోనూ.. ఒకటిగానే నిలిచింది. భర్త మరణవార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడిచింది ఆ భార్య. తమిళనాడు పుదుక్కొట్టై జిల్లాలోని అలంగుడిలో ఈ ఘటన జరిగింది.
వెట్రివేల్(90), పిచాయ్(75)కు పెళ్లై దాదాపు 50 ఏళ్లు దాటింది. వీరికి ఐదుగురు కొడుకులు, ఓ కూతురు, 23 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. సోమవారం రాత్రి వెట్రివేల్ మరణించారు. భర్త మరణ వార్త విన్న పిచాయ్ కన్నీరుమున్నీరైంది. తన భర్త ఇక లేడు అని తట్టుకోలేకపోయింది. కొద్దిగంటలకే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. దంపతులిద్దరికీ కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇదీ చూడండి : శబరిమల, రఫేల్ కేసులపై రేపు సుప్రీం తీర్పు