మధ్యప్రదేశ్‌కు చెందిన రెవాబాయి అనే ఆదివాసి వనిత... మహిళా సాధికారితే లక్ష్యంగా ఓ సొంత బ్యాంకును ప్రారంభించి...ఇప్పడు దాదాపు 715 గ్రామాల్లో సేవలను అందిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభించి ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్‌కు తీసుకొచ్చారు.
అలా మొదలైంది
మధ్యప్రదేశ్ బర్వాని జిల్లాలో గంధ్వాల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆదివాసి ప్రాంతం అది. అక్కడ రెవాబాయ్ అనే గిరిజన మహిళ సొంత వ్యాపారం చేయాలని తలచి రుణం కోసం ప్రైవేట్ బ్యాంక్‌ను ఆశ్రయించారు.
తన వద్ద ఎటువంటి ఆస్తులు, ధ్రువపత్రాలు లేనందున రుణం ఇవ్వటానికి తిరస్కరించింది ఆ బ్యాంకు. ఆ రోజు.. తన మనస్సులో బలంగా నాటుకుపోయింది. ఓ బ్యాంకు ప్రారంభించి తన లాంటి ఎంతో మంది వనితలు.. తమ కాళ్లపై నిలబడేందుకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు.
అలా 8ఏళ్ల క్రితం 12మంది మహిళలతో కలిసి 'సమృధి క్రెడిట్ సంస్థ' అనే బ్యాంకును ప్రారంభించారు. అది ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి 100కోట్ల టర్నోవర్‌కు చేరింది.
బ్యాంకు ప్రత్యేకత
ఎంతో మంది మహిళలకు ఎటువంటి తాకట్టు, ధ్రువపత్రాలు తీసుకోకుండానే రుణాలు ఇవ్వటం ఈ బ్యాంక్ ప్రత్యేకత. ఇలా ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్కరూ రుణాలు తిరిగి చెల్లించకుండా లేరు.
ఇతర గ్రామాల్లోనూ సేవలు
8 ఏళ్ల క్రితం ఆ ఒక్క ఊరికే పరిమితమైన ఆ బ్యాంకు.. ఈ రోజు 715 గ్రామాల్లో సేవలను అందిస్తోంది. చుట్టు పక్కల 37 గ్రామాల్లోని 3000 మంది వనితలకు అండగా నిలిచింది. ప్రతి శాఖలోనూ విధి నిర్వహణను మహిళలే చూసుకోవడం విశేషం. ఇప్పటివరకు కోటి యాభై లక్షల రుణాల్ని మహిళలకు అందించారు.
ప్రస్థానం..
రెవాబాయి మెదటి సారి ఓ బ్యాంకు నుంచి రూ.1000 రుణాన్ని తీసుకున్నారు. ఆ రుణంతో కొన్ని కోళ్లను కొన్నారు. వాటి గుడ్లతో వ్యాపారం ప్రారంభించారు. అందులో వచ్చిన లాభాలతో మరింత రుణాన్ని తీసుకొని ఓ గేదెను కొన్నారు. అలా క్రమక్రమంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అంచెలు అంచెలుగా ఎదిగారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు రెవాబాయి.
ఇదీ చూడండి : 50 గుడ్లు తినాలనుకున్నాడు.. ప్రాణాలు వీడాడు..!