కర్ణాటక రాయ్‌చూర్‌లో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్ ఛాతీలోకి ఇనుపకడ్డీ దూసుకెళ్లింది. అయితే.. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.
ఇదీ జరిగింది..
గురమితక్కల్ ప్రాంతానికి సమీపంలో బస్సు వెనుక భాగాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన కోటేశ్వర్రావు అనే లారీ డ్రైవర్ ఛాతీలోకి ఓ ఇనుప కడ్డీ దూసుకుపోయింది. స్థానికులు అతడిని రిమ్స్ ఆసుపత్రిలో చేర్చగా.. వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ కడ్డీని బయటకు తీశారు.
గునపంలాంటి ఇనుప కడ్డీ కోటేశ్వర్ రావు శరీరంలోకి దూసుకుపోయినా.. వైద్యులు విజయవంతంగా అతడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోటేశ్వర్రావు సురక్షితంగా ఉన్నాడు.
ఇదీ చదవండి:ఉన్నావ్ కేసులో దోషి కుల్దీప్ సెంగారే: కోర్టు తీర్పు