ETV Bharat / bharat

జాతీయ పౌర జాబితాపై 'యూఎస్​సీఐఆర్​ఎఫ్' ఆందోళన!

భారత్​లో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎన్​ఆర్​సీపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికాకు చెందిన ఓ అంతర్జాతీయ సంస్థ. అసోంలో ఎప్పటినుంచో జీవిస్తున్న 19 లక్షలమంది స్వస్థలం కోల్పోతుండటం సరికాదని వ్యాఖ్యానించింది.

జాతీయ పౌర జాబితాపై 'యూఎస్​సీఐఆర్​ఎఫ్' ఆందోళన!
author img

By

Published : Nov 20, 2019, 9:54 AM IST

జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)పై.. అమెరికాకు చెందిన యూఎస్​సీఐఆర్​ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్​ఆర్​సీ వల్ల అసోంలో ఎప్పటి నుంచో జీవిస్తున్న 19 లక్షలమంది స్వస్థలం కోల్పోతుండటం సరికాదని వ్యాఖ్యానించింది. ఎన్​ఆర్​సీ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తెలిపింది.

జాతీయ పౌర జాబితాలో మత స్వేచ్ఛకు ఉన్న చిక్కులపై ప్రస్తావించిందీ సంస్థ. 19 లక్షల మంది పేర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయని.. ముస్లిం జనాభాను తప్పించేందుకు ఈ ప్రక్రియ ఉపకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

"19 లక్షల మంది అసోం వాసులు త్వరలో స్వస్థలాన్ని కోల్పోతారు. ఎన్​ఆర్​సీ.. న్యాయబద్ధంగా, పారదర్శకంగా, సరైన ప్రక్రియలో జరగనందున వారు తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. అసోంలోని ముస్లింలను బయటకు పంపించే ఉద్దేశంగానే భారత రాజకీయ నేతల వ్యాఖ్యలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. ముస్లింలే లక్ష్యంగా ఈ జాబితాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు."

-అనురిమా భార్గవ, యూఎస్​సీఐఆర్​ఎఫ్ కమిషనర్

ఎన్​ఆర్​సీ ప్రక్రియ భారత పౌరసత్వానికి పరీక్షగా తయారయిందని.. యూఎస్​సీఐఆర్​ఎఫ్​ ఛైర్మన్ టోనీ పెర్కిన్స్ వెల్లడించారు.

రెండో జాబితాలో భారత్..

యూఎస్​సీఐఆర్​ఎఫ్​ నివేదిక-2019 మత స్వేచ్ఛపై సహనం-హింస విభాగంలో భారత్​ను టైర్​-2 జాబితాలో చేర్చింది ఈ అమెరికా సంస్థ.

ఇదీ చూడండి: రాజకీయ 'మైత్రి'కి రజనీ-కమల్​ సిద్ధం!

Guwahati (Assam), Nov 20 (ANI): Assam's Minister for Transport, Industry and Commerce, Chandra Mohan Patowary announced that sanitary pads are mandatory in all factories and industries. Speaking on it, Chandra Mohan Patowary said, "Government has made it mandatory for all factories and industries in the state to keep sanitary pads for the welfare of the working women in the factories."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.