ETV Bharat / bharat

'సీఎం యోగీ వస్తేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తాం'

ఉన్నావ్​ హత్యాచార కేసులో సత్వర న్యాయం కావాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు ​ బాధితురాలి సోదరి. సీఎం యోగీ ఆదిత్యనాథ్​ తమ నివాసానికి వచ్చి హామీ ఇస్తే గానీ.. అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు.

Unnao rape victim's sister says family won't perform last rites unless CM Yogi reaches her village
'సీఎం యోగీ వస్తేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తాం'
author img

By

Published : Dec 8, 2019, 12:16 PM IST

Updated : Dec 8, 2019, 12:50 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ బాధితురాలి సోదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ కోల్పోయిన తమకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తమ నివాసానికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు అంత్యక్రియలు జరిపించబోమని స్పష్టం చేశారు. నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్​ చేశారు.

'సీఎం యోగీ వస్తేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తాం'

'మా డిమాండ్​ ఏంటంటే.. సీఎం యోగీ ఇక్కడకు వచ్చి సత్వర న్యాయం చేయాలి. మా అక్క అంత భయానక ఘటన చూసింది.. వారి రాక్షస చర్యకు బలైంది. ఆమెను సజీవ దహనం చేశారు. సాక్ష్యాలు కళ్లెదురుగానే ఉన్నాయి. ఇంకేం కావాలి? మేము తరువాత కోర్టుల చుట్టూ తిరిగి పోరాడలేము.. మేము అంత డబ్బు ఉన్నవాళ్లం కాదు. మేము రేపు ప్రభుత్వాన్ని కలవగలమో లేదో.. అందుకే మాకు నేడే న్యాయం కావాలి. జిల్లా అధికారులను అడిగితే వారు మమ్మల్నే అక్కడికి రమ్మని పిలుస్తున్నారు. మేము అక్కడికి వెళ్లి ఏం చేయాలి? ఆయన్నే (సీఎం) ఇక్కడికి రానివ్వండి.. ఆయన కూడా చూస్తారు కదా మేము ఎలాంటి దుర్భర స్థితిలో ఉన్నామో!'
-ఉన్నావ్​ బాధితురాలి సోదరి.

తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆమె కోరారు. మరోవైపు జిల్లా అధికారులు బాధితురాలి అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'

Mumbai, Dec 08 (ANI): Kartik Aaryan, Ananya Panday and Bhumi Pednekar visited a theatre to get the reactions on recently released film 'Pati, Patni Aur Woh'. They seemed happy with the reactions of fans. They also clicked pictures with their fans. Kartik even shook a leg on the song 'Ankhiyon Se Goli Mare'. The film hit theatres on December 06.
Last Updated : Dec 8, 2019, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.