ETV Bharat / bharat

'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు' - madras high court on unmarried couple staying in hotels

హోటల్​ గదుల్లో పెళ్లికాని ఓ అమ్మాయి, అబ్బాయి ఉండడంలో తప్పేముంది అని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి కాకుండా సహజీవనం కొనసాగించేవారిని ఎలా ప్రశ్నించలేమో అలాగే వారి ఇష్ట ప్రకారం ఒక గదిలో బస చేసే జంటను ప్రశ్నించే అధికారం లేదు అని స్ఫష్టం చేసింది.

unmarried-couple-staying-in-same-hotel-room-is-not-an-offence-says-madras-high-court
'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'
author img

By

Published : Dec 8, 2019, 11:10 AM IST

Updated : Dec 8, 2019, 11:21 AM IST

అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జికి ఇటీవల జిల్లా అధికారులు సీలు వేశారు. ఓ గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయనే కారణాలను పోలీసు, రెవెన్యూ అధికారులు చూపించారు. దీన్ని సవాల్‌ చేస్తూ లాడ్జి యాజమాన్యం మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ జస్టిస్​ ఎం.ఎస్‌.రమేశ్‌ సమక్షంలో విచారణకు వచ్చింది.

Unmarried couple staying in same hotel room is not an offence says Madras High Court
ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు

పోలీసులు చెప్పే వివరణతో ఏకీభవించలేమని, అవివాహిత స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టం లేని నేపథ్యంలో అది ఎలా తప్పవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘లివింగ్‌ టు గెదర్‌’ విధానంలో సహజీవనాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో, అలాగే లాడ్జిలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని స్పష్టం చేశారు.

మరో గదిలో మద్యం సీసాలు ఉండటం వల్ల ఆ లాడ్జి అక్రమంగా బార్‌ నిర్వహిస్తోందనీ చెప్పలేమని పేర్కొన్నారు. తమిళనాడు మద్యపానచట్టం ప్రకారం ఓ వ్యక్తి 4.5 లీటర్ల విదేశీ మద్యం, 7.8 లీటర్ల బీరు, 9 లీటర్ల వైన్‌ కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చిందన్నారు. లాడ్జి మూసివేతలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదని, అందువల్ల సీలు తొలగించాలని కోయంబత్తూరు కలెక్టరును న్యాయమూర్తి ఆదేశించారు.

ఇదీ చదవండి:రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు

Intro:Body:

Unmarried couple staying in same hotel is not an offence says Madras High Court

Chennai: The Madras High court noted , Unmarried couple staying in same hotel is not a criminal offence

The court was dealing with a petition filed by private hospitality limited from Haryana, owning a serviced apartment in Coimbatore against authorities sealing the complex after an unmarried couple was found staying in a room and liquor bottle in another room.

Justice MS Ramesh said"Without any prior Investigation, the authorities who sealed the apartment are wrong. And he continued there is no activity in the Indian constituencies says  "Living together" is an offense. So we cannot consider it as an offense if the unmarried couple stays together in a hotel.

And according to the Tamil Nadu liquor act, a person can keep 4.5 litres of foreign liquor, 7.8 litres of beer and 9 litres of wine. So Keeping liquor bottles inside the crime is not a crime said, Justice MS Ramesh.

He ordered the district collector to cancel the seal which is kept in the hotel premises.

Conclusion:
Last Updated : Dec 8, 2019, 11:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.