జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్ఆర్సీ), పౌరసత్వ చట్టం(సీఏఏ)ల చరిత్రను తెలుసుకోండని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వివక్ష చూపుతోందని ఆరోపించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు.
"ఒక్కసారి 'చరిత్రను అర్థం చేసుకోండి.' మొదట 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మీకు వాగ్దానం చేస్తారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మీ విశ్వవిద్యాలయాలపై దాడి చేస్తారు. ఆపై రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. అప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా మీరు నిరసనలు తెలుపుతారు. వారు మిమ్మల్ని మూర్ఖులుగా పరిగణిస్తారు. అయినా యువభారతం పోరాడుతూనే ఉంటుంది."
-ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఉద్దేశిస్తూ "దయచేసి చరిత్రను అర్థం చేసుకోండి" అని షా అన్నారు. దేశంలో మొదట పౌరసత్వ బిల్లు(సీఏబీ) ప్రవేశ పెట్టిన తర్వాత, ఎన్ఆర్సీని తీసుకొస్తామని.. ఇది కేవలం బంగాల్‌కు వర్తించదని, దేశమంతటా ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ఆనాడు తెలిపారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రియాంక విమర్శలు గుప్పించారు.