అసోంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. వీరి మరణంతో.. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న అర్లల్లలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది.
శనివారం రాత్రి ఒకరు, నేటి ఉదయం మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు గువహటి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ రామెన్ తాలూక్దార్ వెల్లడించారు. తుపాకీ గాయాలతో బుధవారం నుంచి మొత్తం 27 మంది ఆసుపత్రిలో చేరారని అయన తెలిపారు.
అయితే పోలీసుల కాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ప్రజలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.