అసోం గువహటిలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కర్ఫ్యూ విధించారు. నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా గురువారం ఆందోళనకు దిగారు నిరసనకారులు. అయితే గువహటి లూలుంగావ్ ప్రాంతంలో చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.
డీజీపీ కాన్వాయ్‌పై రాళ్లదాడి
అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్లదాడి చేశారు. గువహటిలో గస్తీ విధులను పర్యవేక్షిస్తూ క్రిష్టియన్ బస్తీకి వెళ్లారు భాస్కర్. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు.
ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీ చట్టసభ రిజర్వేషన్ల పెంపునకు పార్లమెంట్ ఆమోదం