ETV Bharat / bharat

ఉగ్రసింహం 'బాగ్దాదీ' కుక్కచావు..!

author img

By

Published : Oct 29, 2019, 7:56 AM IST

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థ అగ్రనేత అబు బకర్​ అల్​ బాగ్దాదీని అంతం చేయటంలో దీప కాంతుల పండుగ రోజే అమెరికా విజయం సాధించింది. కానీ బాగ్దాదీ మరణంతోనే ఐఎస్‌ అంతమైపోతుందా అన్న ప్రశ్న ప్రపంచదేశాల ఆలోచనాపరుల్ని తొలుస్తూనే ఉంది.

కుక్కచావు చచ్చిన 'బాగ్దాదీ'తోనే ఐఎస్‌ మలిగిపోతుందా..?

చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతమైన దీపావళి పర్వదినం నాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముఖతా ఓ శుభవార్త వెలువడింది. కరడుగట్టిన ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అధిపతి అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్‌ కైలా ముల్లెర్‌’లో కడతేరిపోయాడన్న సమాచారంతో- మరో ‘లాడెన్‌’ పీడ విరగడైందన్న సంతోషం దేశదేశాల్లో వ్యక్తమవుతోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌) పేరిట పశ్చిమాసియాలో కుబుసం విడిచిన ఉగ్రనాగు దేశాల సరిహద్దుల్నే తిరగరాసే దీర్ఘకాల లక్ష్యాల వల్లెవేతతో 2014 జులైలోనే తన పేరును ఇస్లామిక్‌ స్టేట్‌ (ఇస్లాం రాజ్యం)గా మార్చుకొంది.

దారుణ మారణహోమంతో ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న దాని అధిపతి బాగ్దాదీ తలకు రెండున్నర కోట్ల డాలర్ల వెలను అమెరికాయే నిర్ణయించింది. 2017లో సిరియాలోని రక్కా నగరంపై తాము జరిపిన భీకర దాడుల్లో బాగ్దాదీ హతమారిపోయి ఉంటాడని రష్యా ప్రకటించినా, అమెరికా దాన్ని విశ్వసించలేదు. సిరియాలో ఐఎస్‌ కోటల్ని కూలగొట్టడంలో స్థానిక కుర్దుల తోడ్పాటుతో విజయం సాధించిన అగ్రరాజ్యం- సంక్షుభిత ప్రాంతం నుంచి వైదొలగే క్రమంలో చేపట్టిన ఆపరేషన్‌ ఇది! రష్యా, ఇరాక్‌, టర్కీల గగన తలాన్ని ఉపయోగించుకొంటూ బాగ్దాదీ రహస్య జీవనం గడుపుతున్న ఇడ్లిబ్‌లోని స్థావరంపై ఎనిమిది హెలికాప్టర్లతో విరుచుకుపడిన అమెరికా- దిక్కుతోచని స్థితిలో సొరంగంలోకి పరారైన బాగ్దాదీ అంతిమంగా ఆత్మాహుతికి పాల్పడి కుక్క చావు చచ్చాడని ప్రకటించింది. యావత్‌ ‘ఆపరేషన్‌’ను సినిమా మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించానన్న ట్రంప్‌- పట్టుమని పావుగంటలోనే డీఎన్‌ఏ పరీక్ష ద్వారా చనిపోయింది బాగ్దాదీయేనని నిర్ధారించడం, ఇంటాబయటా పోటెత్తుతున్న వ్యతిరేక పవనాల తాకిడి నుంచి ఉపశమనం పొందడానికేనన్న సంగతి తెలుస్తూనే ఉంది. బాగ్దాదీ మరణంతోనే ఐఎస్‌ మలిగిపోతుందా అన్న ప్రశ్న ఆలోచనాపరుల్ని తొలుస్తూనే ఉంది!

‘ఉగ్రవాదంపై సమరం అల్‌ఖైదాతో మొదలవుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఉగ్రసంస్థనూ గుర్తించి, నిరోధించి, ఓడించేదాకా ఆ పోరు నిర్నిరోధంగా సాగుతుంది’- సెప్టెంబరు 11నాటి భయానక దాడుల నేపథ్యంలో శ్వేత సౌధాధిపతిగా జార్జి బుష్‌ చేసిన ప్రతిజ్ఞ అది. అఫ్గాన్‌లో తిష్ఠ వేసిన తాలిబన్‌ ప్రభుతను, దాని మద్దతుతో ఎంతకైనా తెగిస్తున్న అల్‌ఖైదాను ఖతం చెయ్యడమే అజెండాగా జార్జిబుష్‌ ప్రారంభించిన ‘ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరు’లో వ్యూహాత్మక భాగస్వామిగా పాకిస్థాన్‌ కుదురుకొంది.
అగ్రరాజ్యం తాలిబన్ల తలకొట్టి మొలేశాక అల్‌ఖైదా అగ్రనేత బిన్‌ లాడెన్‌కు సురక్షిత స్థావరంగా పాకిస్థానే అక్కరకొచ్చింది! 2011 మే నెలలో అమెరికన్‌ దళాలు సాగించిన రహస్య ఆపరేషన్‌లో బిన్‌ లాడెన్‌ హతమారిపోవడాన్ని నాటి ఒబామా ప్రభుత్వమూ ఇప్పటిలాగే ప్రపంచానికి ఘనంగా చాటింది. లాడెన్‌ను మట్టుబెట్టడం కంటే బాగ్దాదీని వేటాడటమే మరింత ఘనకార్యమని చాటుకోవడంలో ట్రంప్‌ రాజకీయ లక్ష్యాలు ఏమైనప్పటికీ- అల్‌ఖైదాకు భిన్నమైన ముస్లిం రాజ్య విస్తరణ అజెండాతో ఐఎస్‌ అధిపతి సాగించిన మారణహోమం దేశదేశాల సమగ్రతకే చిచ్చుపెట్టేటంత భయానకమైనది.

చైనా, ఇండియా, పాలస్తీనా, సోమాలియా, ఈజిప్టు, ఇరాక్‌, ఇరాన్‌, ఫిలిప్పీన్స్‌, మొరాకో వంటి తూర్పు, పశ్చిమ దేశాల్లో ముస్లిముల హక్కుల్ని తొక్కిపట్టారంటూ ఆయా దేశాలపై జిహాద్‌కు ఐఎస్‌ పిలుపిచ్చింది! ఇరాక్‌లో అల్‌ఖైదా నీడన రాటుతేలి, ఐఎస్‌ఐఎస్‌ స్థాపించిన కొద్దికాలంలోనే బలాన్ని, బలగాన్ని ఊహాతీతంగా విస్తరించిన బాగ్దాదీ- ప్రపంచవ్యాప్తంగా పారించిన నెత్తుటేళ్లు ఇన్నీఅన్నీ కావు. బాగ్దాదీ అంతమైపోవడంతోనే ఐఎస్‌ నరమేధానికి తెరపడుతుందన్న అంచనాలూ సరికాదు!

‘జాతీయవాద ప్రజాస్వామ్యాల గుట్టు రట్టు చేసి, వాటిని ఇనుప బూట్ల కింద నలిపి నాశనం చేసే తరుణం ఇదే’నన్న బాగ్దాదీ ఉద్బోధ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర భావజాల ప్రజ్వలనానికి బలీయంగా ఊపిరులూదింది. ఖురసాన్‌ ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటును ప్రస్తావించిన ఐఎస్‌- ఇండియాలోని గుజరాత్‌ సహా వాయవ్య ప్రాంతం అంతా తమ అధీనంలోకి రావాలని అయిదేళ్లనాడే విస్తరణ కాంక్షను బయటపెట్టింది.

తానెందుకు వెనకబడాలనుకొన్న అల్‌ఖైదా- మియన్మార్‌, బంగ్లాదేశ్‌, అసోం, గుజరాత్‌, అహ్మదాబాద్‌, కశ్మీరులను అప్పుడే ప్రస్తావించింది. లాడెన్‌తోపాటే అల్‌ఖైదా సమసిపోలేదనడానికి నిదర్శనమది. ఇరాక్‌ సిరియా సరిహద్దుల్లో బాగ్దాదీ నిర్మించిన ‘ముస్లిం రాజ్యా’న్ని నిర్మూలించామని మొన్న మార్చినెలలో అమెరికా ఘనంగా ప్రకటించినా- క్రీస్తు పునరుత్థాన దినం (ఈస్తర్‌)నాడు శ్రీలంక గుండె చెదిరేలా ఎనిమిదిచోట్ల సాగిన మారణహోమం ఐఎస్‌ సానుభూతి సంస్థల నిర్వాకమేనని వెల్లడైంది. శత్రువుల మీద అలాగే విరుచుకుపడాలంటూ మిలిటెంట్లకు ఉద్బోధించిన బాగ్దాదీ- ఖురసాన్‌ ప్రస్తావనతోనే యువజనాన్ని సూదంటురాయిలా ఉగ్రవాదంవైపు లాగిన అదృశ్య శక్తి. అలాంటివాడి పతనం- దేశాధ్యక్షుడిగా అస్తిత్వ పోరాటం చేస్తున్న ట్రంప్‌కు రాజకీయంగా ఏమైనా లాభిస్తుందేమోగాని, ప్రపంచ దేశాలకు దక్కే సాంత్వన ఏపాటి? విశ్వవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిలువరించడంలో అమెరికా విధానాలు విఫలమయ్యాయని అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్‌ లోగడ నిష్ఠుర సత్యం పలికారు. బాగ్దాదీ వేట తన ఘనతేనని ట్రంప్‌ నేడు ఎన్ని భుజకీర్తులు తగిలించుకొన్నా, ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చలేరు!

ఇదీ చూడండి : సౌదీ అరేబియా చేరుకున్న ప్రధాని మోదీ...

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 29 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2346: US NY Joker Stairs AP Clients Only 4237135
Mixed reaction to popularity of 'Joker' film steps
AP-APTN-2343: US IL Trump Eddie Johnson Must Credit ABC 7 Chicago, No Access Chicago, No Use US Broadcast Networks, No Re-sale, reuse or archive 4237156
Chicago police superintendent responds to Trump
AP-APTN-2341: UN Security Council MidEast 2 AP Clients Only 4237154
Israel at UN: Turkey a "hub for terrorism"
AP-APTN-2339: US White House Halloween AP Clients Only 4237155
Trumps give out treats at spooky White House
AP-APTN-2329: Mexico Monarch Arrival AP Clients Only 4237153
Monarch butterfly arrives in Mexico
AP-APTN-2326: US CA Sonoma Fire Update AP Clients Only 4237152
Firefighters battle N. Calif. wine country blaze
AP-APTN-2325: Cuba Dollar Store AP Clients Only 4237151
Cuba opens stores that accept hard currencies
AP-APTN-2323: UK Election Vote Reaction AP Clients Only 4237150
Analyst on UK parliament vote to reject election
AP-APTN-2312: US Dog al Baghdadi-Baghdadi AP Clients Only 4237149
Trump releases photo of dog in al-Baghdadi raid
AP-APTN-2256: Argentina Elections Reax AP Clients Only 4237147
Argentines celebrate, lament election of Fernández
AP-APTN-2237: US MD Newspaper Shooting Part Must Credit Hannah Gaskill/Capital News Service; University Of Maryland; Part Must Credit Anne Arundel Police 4237146
Gazette newspaper shooter pleads guilty
AP-APTN-2227: US IL Trump Speech Reaction AP Clients Only 4237145
Chicago protesters march as Trump visits his hotel
AP-APTN-2221: US TX Party Shooting Arrest Must credit KDFW Fox 4; No access Dallas; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4237144
Suspect arrested in deadly Texas party shooting
AP-APTN-2220: US CA Los Angeles Fire Must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4237143
Mayor: Growth of Los Angeles wildfire has slowed
AP-APTN-2213: UN Security Council MidEast AP Clients Only 4237142
Israel at UN: Turkey a 'hub for terrorism'
AP-APTN-2202: Chile Clashes 2 AP Clients Only 4237140
Dramatic scenes as Chile protests turn violent
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.