ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భారీగా హిమపాతం నమోదైంది. ఇళ్లు, కార్యాలయాలు, చెట్లు ధవళ వర్ణాన్ని సంతరించుకున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది.
జమ్ము కశ్మీర్
జమ్ముకశ్మీర్లో విపరీతంగా కురుస్తోన్న మంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు అక్కడి ప్రథమ పండగలైన లోహ్రీ, మకర సంక్రాంతిని ఆనందంతో జరుపుకునే అవకాశం లేకపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
స్తంభించిన రవాణా..
విపరీతంగా కురుస్తోన్న మంచు కారణంగా... రాంబన్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాతా వైష్ణో దేవి ఆలయం వైపు ప్రయాణించే పలు విమానసర్వీసులు రద్దయ్యాయి.
చర్యలు..
రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. జేసీబీల సాయంతో మంచు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు సిబ్బంది.
హిమాచల్ ప్రదేశ్
హిమచల్ ప్రదేశ్లోని అనేక పర్యటక ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవడం వల్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయని వాతవరణ శాఖ ప్రకటించింది. జనవరి 13వ తేదీ వరకు ఆరెంజ్ అలర్ట్, జనవరి 16వ తేదీ వరకు ఎల్లో(పసుపు) అలర్ట్ ప్రకటించింది.
ఇదీ చూడండి : ఫేస్బుక్ ప్రేమ: విదేశీ అమ్మాయితో మనోడి పెళ్లి