భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి తన చివరి పని దినాన్ని ప్రత్యేకంగా ముగించారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్టయిన పిటిషన్లన్నింటికీ ఈరోజు ఒకేసారి నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా సీజేఐగా తన చివరి పని దినాన్ని ముగించుకున్నారు.
సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ రంజన్ గొగొయికు వీడ్కోలు పలకనున్నారు. ఈ నెల 17న జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ చేయనున్నారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడం వల్ల ఆయన ఇవాళ సీజేఐగా తన చివరి పని దినాన్ని ముగించుకున్నారు. ఆయన స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే బాధ్యతలు స్వీకరిస్తారు.
సీజేఐగా కీలక తీర్పులు...
భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి ఇచ్చిన కీలక తీర్పులు..
⦁ ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతోన్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో చారిత్రక తీర్పు.
- పూర్తి కథనం కోసం: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం
⦁ శబరిమలకు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను.. ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయం.
- పూర్తి కథనం కోసం:'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ
⦁ రఫేల్ యుద్ధవిమాన కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్. రఫేల్ తీర్పును సమీక్షించాలనే పిటిషన్లు కొట్టివేత.
- పూర్తి కథనం కోసం:కేంద్రానికి 'రఫేల్' ఊరట- మరోమారు సుప్రీం క్లీన్చిట్
⦁ భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం.. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని సంచలన తీర్పు
- పూర్తి కథనం కోసం: ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం- సుప్రీం సంచలన తీర్పు
⦁ రఫేల్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ కొట్టివేత
- పూర్తి కథనం కోసం: 'ధిక్కరణ'పై సుప్రీంలో రాహుల్కు ఊరట... కానీ....