ETV Bharat / bharat

నేడు గురునానక్ జయంతి-వైభవంగా ఏర్పాట్లు! - Pb Guv calls upon people to follow path shown by Guru Nanak Dev

దేశవ్యాప్తంగా గురుపర్వ్​ వేడుకలు నేడు అట్టహాసంగా జరగనున్నాయి. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ఈ ఉత్సవ ప్రధాన కార్యక్రమం.. పంజాబ్​ రాష్ట్రం సుల్తాన్​పుర్​ లోధిలోని డేరాబాబా నానక్ వద్ద జరగనుంది. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

నేడు గురునానక్ జయంతి
author img

By

Published : Nov 12, 2019, 6:54 AM IST

Updated : Nov 12, 2019, 11:51 AM IST

నేడు గురునానక్ జయంతి-వైభవంగా ఏర్పాట్లు!

సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి వేడుకలు నేడు వైభవంగా జరగనున్నాయి. సుల్తాన్​పుర్​ లోధీలో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. గురుపర్వ్ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరుకానున్నారు. పంజాబ్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.

'ప్రార్థనలు మాత్రమే'

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, కేంద్రమంత్రి అమిత్​షా సహా పలువురు రాజకీయ ప్రముఖులకు ఉత్సవ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. పలువురు రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు ఉండబోవని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఈ నెల తొమ్మిదిన పంజాబ్​ సుల్తాన్​పుర్​ లోధిలోని డేరాబాబా నానక్​.. పాకిస్థాన్​లోని దర్బార్​ సాహిబ్​ను కలిపే కర్తార్​పుర్ నడవా​ను ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, ఇమ్రాన్​ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. పాక్​లోని దర్బార్​ సాహిబ్​లోనే గురునానక్ తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గడిపారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..

గురునానక్ జయంతి సందర్భంగా రాజధాని ఛండీగఢ్​ సహా పంజాబ్​ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

'గురు నానక్ బాటలో నడవాలి'

గురుపర్వ్ సందర్భంగా గురునానక్ బాటలో నడవాలని పంజాబ్​ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ పిలుపునిచ్చారు. గురుపర్వ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిక్కుల విశ్వాసమైన అందరి సంక్షేమం, సమానత్వం, సామాజిక న్యాయం అనే అంశాలను ఆయన గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'అధికరణ 370.. వేర్పాటువాదులకే ప్రయోజనం చేకూర్చింది'

Dharamshala (Himachal Pradesh), Nov 12 (ANI): The Dalai Lama led an interactive session on "Cultivating Compassion in the Next Generation" with a delegation from Washington State at his residence on November 11. The discussion was led by the Lieutenant Governor of Washington State, Cyrus Habib. The discussion saw the involvement of youth and community leaders from Washington State.
Last Updated : Nov 12, 2019, 11:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.