పౌరసత్వ చట్ట సవరణను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు సుప్రీంకోర్టు నిరాకరించగా... డిసెంబర్ 16న అయినా వాదనలు ఆలకించాలని మహువ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు.
మరో మూడు పిటిషన్లు
పౌరసత్వ చట్ట సవరణను సవాల్ చేస్తూ ఇప్పటికే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, రెండు స్వచ్ఛంద సంస్థలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. మతం ఆధారంగా పౌరసత్వం కల్పించడాన్ని పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఈశాన్యం నుంచి దృష్టి మరల్చేందుకే 'రేప్'పై దుమారం'