పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా బంగాల్లో నిరసనలు చెలరేగాయి. హావ్‌డా జిల్లా ఉలుబెరియా వద్ద 6వ నెంబరు జాతీయ రహదారిపై వేలాది మంది ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. జాతీయ జెండా, నల్ల జెండాలు పట్టుకుని... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టైర్లు తగలబెట్టి, రోడ్డుపై బైఠాయించారు నిరసనకారులు. ఎన్ఆర్సీ, పౌరసత్వ చట్ట సవరణ ద్వారా మతపరంగా దేశ ప్రజలను కేంద్రం విభజిస్తోందని ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ వచ్చి తమ డిమాండ్లను వినేంత వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కోల్‌కతాను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే రహదారుల్లో ఎన్‌హెచ్-6 ప్రధానమైంది. ఈ అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్డుపై నిరసనలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఇదీ చూడండి:- 'పౌర' చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో వ్యాజ్యం