కేరళ కొల్లం జిల్లాలో '10వ జాతీయ సీనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్' జరుగుతోంది. పోటీలు హోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో.. మైదానంలో ఓ 13 ఏళ్ల ముహమ్మద్ కైఫ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బాల్‌బాయ్‌గా క్రీడాకారులకు అవసరమైనప్పుడు బంతిని అందించడమే కాదు.. వారికి నీళ్లు, తేనీరు అందిస్తూ ఆటగాళ్లతో పాటు హాకీపై తనకున్న గౌరవాన్ని చాటుతున్నాడు. మైదానంలో చురుకుగా కదులుతూ.. అందరి మనుసులు గెలిచాడు.
కొల్లం స్పోర్ట్ అకాడమీ నుంచి పలు పోటీల్లో కేరళ తరఫున పాల్గొన్న కైఫ్.. హాకీలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకే తాను మైదానంలోకి వస్తున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లకు సాయం చేస్తూనే.. ఎంతో నేర్చుకోవచ్చని చెబుతున్నాడు.
బిహార్‌కు చెందిన జుమ్మానత్తాఫ్, గుల్జన్ల దంపతుల కుమారు కైఫ్. వారు కొన్నేళ్ల క్రితం.. కేరళకు వలస వచ్చారు. ఇక్కడే.. కొల్లం స్పోర్ట్స్ అకాడమీలో క్రీడా స్ఫూర్తికి సానపెడుతున్నాడు కైఫ్.