ETV Bharat / bharat

'ఉల్లి' దొంగతనాలే దేశంలో నయా ట్రెండ్​! - thief caught incctv camera while stealing onion in roorkee, tamilnadu

దేశంలో 'ఉల్లి' సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ధరలు మాత్రం ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ కారణంగా.. వేరే గత్యంతరం లేక పలుచోట్ల కొంతమంది ఉల్లిగడ్డల చోరీకి పాల్పడుతున్నారు. తమిళనాడు, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లలో చోటు చేసుకున్న ఈ ఉల్లి దోపిడీ ఘటనలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

కొండెక్కిన 'ఉల్లి' ధరలతో వరుస దొంగతనాలు
author img

By

Published : Dec 10, 2019, 10:07 AM IST

Updated : Dec 10, 2019, 6:45 PM IST

'ఉల్లి' దొంగతనాలే దేశంలో నయా ట్రెండ్​!

దేశంలో రోజురోజుకూ ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. సోషల్​ మీడియాలోనూ వీటిపై ఎన్నో జోకులు పేలుతున్నాయి. పలుచోట్ల దుకాణాల్లో, మార్కెట్లలో రవాణా అవుతుండగానే దారి మధ్యలో చోరీలకు గురవుతున్నాయి. తాజాగా తమిళనాడు మదురైలోని ఓ కిరాణా దుకాణంలో, ఉత్తరాఖండ్​ ఓ పెట్రోల్​ బంక్​ సమీపంలో ఇలాంటి దోపిడీలు జరిగాయి. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

తమిళనాడు..

తమిళనాడు మదురైలోని ఓ కిరాణా దుకాణంలో ఉల్లిగడ్డలను దొంగిలించాడో వ్యక్తి. అబ్దుల్ ​రెహ్మాన్​ ఓ షాపునకు వెళ్లి అక్కడ పనిచేసే మహిళ దృష్టిని మళ్లించి... ఉల్లిగడ్డలు చోరీచేశాడు. తర్వాత.. ఏమీ ఎరగనట్లు సాదాసీదాగా అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. 2 కేజీల ఉల్లిగడ్డలతో సహా ఇతర వస్తువులను దొంగిలించిన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉత్తరాఖండ్..​

ఉత్తరాఖండ్​ హరిద్వార్​ జిల్లా రూడ్కీలోనూ ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. తోపుడుబండి మీద కూరగాయలు విక్రయించే వ్యక్తి కాలకృత్యాలను తీర్చుకోవటానికి పక్కకి వెళ్లాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి.. రెండు ఉల్లి బ్యాగ్​లను ఎత్తుకెళ్లిపోయారు. తిరిగి వచ్చిన విక్రయదారుకు ఉల్లిబస్తా కనిపించలేదు. హుటాహుటినసమీపంలోని పెట్రోల్​బంక్​ సీసీటీవీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించాడు. జరిగిందంతా చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు చోట్ల.. విక్రయదారులను బెదిరించి మరీ కేజీల కొద్ది ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్తున్న ఘటనలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఇదీ చూడండి : ఆహా 'రామస్సెరీ ఇడ్లీ' రుచి.. అనరా మైమరచి!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 10, 2019, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.