ETV Bharat / bharat

రాజకీయాలకు అతీతం.. దేశ రక్షణే సర్వస్వం - soldiers editorial

భారతీయ సైనికులు యుద్ధాలలోనే కాదు, అనుదినం ప్రాణాలు ఫణంగా పెడతారు. పాక్‌ సరిహద్దుల్లో కాల్పులకు ఎర అవుతుంటారు.  సియాచిన్‌, థార్‌ ఎడారిలో పహారా కాస్తూ వాతావరణ వైపరీత్యాలకు బలి అవుతుంటారు. తుపానులు, ఉప్పెనలు వచ్చినపుడు తమ క్షేమం చూసుకోకుండా ప్రజా రక్షణకు నడుంకడతారు. వారి కర్తవ్యపరాయణత ఏమాత్రం సడలదు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ పోరు లక్ష్యాలను సాధించడం సైన్యం కర్తవ్యం. అదే దాని వృత్తి ధర్మం. ఈ ధర్మాన్ని అంకిత భావంతో నెరవేర్చాలి.

soldiers
రాజకీయాలకు అతీతంగా... దేశ రక్షణే సర్వసం
author img

By

Published : Jan 24, 2020, 7:45 AM IST

Updated : Feb 18, 2020, 5:00 AM IST

సైన్యాధికారులు కానీ, జవాన్లు కానీ, అందరం రాజ్యాంగబద్ధులమై నడచుకొంటామని ప్రతిన బూనాం. మనల్ని నిరంతరం ముందుకు నడిపించేది, మన కార్యాచరణను మలిచేదీ ఆ ప్రతిజ్ఞేనని మరువకూడదు. రాజ్యాంగ పీఠిక ప్రబోధించిన కీలక విలువలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల పరిరక్షణకు పోరాడటమే మన కర్తవ్యం. దాన్నే సదా నిర్వహిస్తున్నాం’ అని జనవరి 15న సైనిక దినోత్సవంనాడు సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవానే ఉద్ఘాటించారు. సైన్యంపై నానాటికీ రాజకీయాల ప్రభావం పడుతుందని విమర్శలు వస్తున్న వేళ సైన్యాధిపతి రాజ్యాంగ నిబద్ధత గురించి మాట్లాడటం ఎనలేని ప్రాముఖ్యం సంతరించుకొన్నది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి త్రివిధ సాయుధ దళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని ప్రతిపక్షాలు, కొందరు మాజీ సైన్యాధికారులు విమర్శించిన నేపథ్యంలో జనరల్‌ నరవానే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సైన్యంకన్నా జాతీయతా భావన పునాదిగా ఏర్పడిన రాజ్య వ్యవస్థే మిన్న. సాయుధ దళాలకు మార్గదర్శకమైన మౌలిక విలువల్లో ఇది ముఖ్యమైనది. తన దేశం, తన జాతి మనుగడ, శ్రేయస్సు కోసమే సైన్యం ఉంది తప్ప సైన్యం కోసం దేశం లేదు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా జాతి ఆశలు, ఆశయాలు, అభిమతాలు రాజకీయ నాయకత్వం ద్వారానే వ్యక్తమవుతాయి కాబట్టి, రాజకీయ నాయకత్వ దృక్పథానికి అనుగుణంగా సైన్యం నడచుకోకతప్పదు. ‘రాజకీయ నాయకత్వం దేశ ప్రయోజనాల కోసం వివిధ విధానాలు చేపడుతుంది. యుద్ధం కూడా ఆ విధానాల్లో భాగమే. యుద్ధం చేయాలని రాజకీయ విధాన నిర్ణయం జరిగినప్పుడు సైన్యం ఆ పని చేయకతప్పదు. కాబట్టి సైన్యం ముందు రాజకీయ దృక్పథం తలొంచే ప్రసక్తి లేదు’ అని జర్మన్‌ సేనాని, సైనిక వ్యూహకర్త కార్ల్‌ ఫాన్‌ క్లౌస్‌ విట్స్‌ తన ‘ఆన్‌ వార్‌’ గ్రంథంలో ఉల్లేఖించారు.

రాజకీయాలకు అతీతంగా

అలాగని రాజకీయుల మాటలకు డూడూ బసవన్నల్లా తలలూపడం సైన్యం పని కాదు. ‘పోరాటం చేయడమే సైనికుల వృత్తి, విధి. వారి రాజకీయ విశ్వాసాలు, భావజాలాలకు ఇక్కడ స్థానం లేదు’ అని ‘ది ప్రొఫెషనల్‌ సోల్జర్‌’ గ్రంథంలో మోరిస్‌ జారోవిట్స్‌ అనే సిద్ధాంతకర్త ఉద్ఘాటించారు. సైన్యం వృత్తినిబద్ధతతో యుద్ధం చేసినప్పుడు రాజకీయంగా విస్తృత ప్రభావం కనిపిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ పోరు లక్ష్యాలను సాధించడం సైన్యం కర్తవ్యం. అదే దాని వృత్తి ధర్మం. ఈ ధర్మాన్ని అంకిత భావంతో నెరవేర్చాలి. సైన్యం ఆ పని చేయడానికి రాజకీయాలు అడ్డు రాకూడదు. వాటికి అతీతంగా సైన్యం తన విధులను నిర్వహించాలని, దాని వల్ల దాని పోరు సామర్థ్యమూ ఇనుమడిస్తుందని ఆయన వివరించారు. అనేకమంది నిపుణులు సైతం రాజకీయాలకు అతీతంగా కర్తవ్యాలను నిర్వహించే సేన- కదన రంగంలో తన సత్తాను చాటుకోగలుగుతుందని సూత్రీకరించారు. సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచితే, దాని వృత్తినైపుణ్యం, నిబద్ధతలు ప్రకాశిస్తాయి. వృత్తిధర్మ పాలన తప్ప మరో ఆలోచన లేని సైన్యం సహజంగానే పౌర ప్రభుత్వ ఆదేశాలను శిరసావహిస్తుంది.

అనవసరంగా జోక్యం చేసుకోకూడదు

ఏ ప్రజాస్వామ్యానికైనా ఇంతకన్నా ఏం కావాలి? రాజకీయులు సైతం సైన్యం విధి నిర్వహణలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండాలి. యుద్ధంలో గెలవడానికి సైన్యం వ్యూహపరమైన ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది. తగు నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిలో రాజకీయ ఏలికలు చీటికిమాటికి తల దూర్చకుండా ఉండటం చాలా ముఖ్యం. సైన్యానికి లక్ష్య నిర్దేశం చేసి, దాని పని దాన్ని చేయనివ్వడం ఎంతో కీలకం. రాజకీయ నాయకులు తమ వాదప్రతివాదాల్లోకి సైన్యాన్ని లాగకుండా ఉండటం జాతీయ భద్రతకు చాలా మంచిది. సైన్యాధిపతి మాటలు తగ్గించి చేతలు పెంచాలని కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధరి ఇటీవల వ్యాఖ్యానించడం ఏమాత్రం మంచిది కాదు. సైన్యానికి కొన్ని విలువలు, ప్రమాణాలు ఉంటాయి. వాటికి పౌర నాయకులు అడ్డు తగలకూడదు.

ఆ ప్రమాణాలను తామూ గౌరవించాలి. ఉభయులూ ఆ పని చేస్తే దేశం భద్రంగా ఉంటుందని అమెరికన్‌ నిపుణుడు శామ్యూల్‌ హంటింగ్టన్‌ ‘ది సోల్జర్‌ అండ్‌ ది స్టేట్‌’ గ్రంథంలో ఉద్ఘాటించారు. దేశాన్ని రక్షించడం, దేశానికి సేవ చేయడం తన ధర్మంగా సైన్యం భావిస్తుంది. ఆ దేశాన్ని పాలించే రాజ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధమై నడచుకొంటుంది కాబట్టి, సైన్యానికీ అదే రాజ్యాంగం శిరోధార్యం. రాజ్య వ్యవస్థను పౌర ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి సైన్యం విధేయంగా ఉండాలని కొందరు వాదిస్తారు. విధేయత అంటే లక్ష్య సాధనకు, ఆశయాలు, విలువలకు కట్టుబడి ఉండటమే తప్ప ఎవరో కొందరు నాయకులకు, రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడటం కాదు.

ఏమాత్రం సడలదు

భారతీయ సైనికులు యుద్ధాలలోనే కాదు, అనుదినం ప్రాణాలు పణంగా పెడతారు. పాక్‌ సరిహద్దుల్లో కాల్పులకు ఎర అవుతుంటారు. సియాచిన్‌, థార్‌ ఎడారిలో పహరా కాస్తూ వాతావరణ వైపరీత్యాలకు బలి అవుతుంటారు. తుపానులు, ఉప్పెనలు వచ్చినపుడు తమ క్షేమం చూసుకోకుండా ప్రజా రక్షణకు నడుంకడతారు. వారి కర్తవ్యపరాయణత ఏమాత్రం సడలదు.
నలభై ఏళ్లపాటు సైన్యంలో విధులు నిర్వర్తించిన నాకు సైన్యాధిపతి నరవానే ప్రసంగం ఎంతో ఆనందం కలిగించింది. ఇటీవల కొందరు సైన్యాధికారుల ప్రకటనలు నాకు ఇబ్బంది కలిగించాయి. ఈ పరిస్థితిలో కొత్త సైన్యాధిపతి విలువల గురించి, రాజ్యాంగ నిబద్ధత గురించి నొక్కిచెప్పడం ఎంతో ఊరట కలిగించింది. ఆయన తాను చెప్పేది ఆచరించి చూపుతారని నమ్ముతున్నాను. భారతదేశంలోని ఉత్కృష్ట సంస్థల్లో సైన్యం ఒకటి. దాని గొప్పదనాన్ని కాపాడటం మనందరి విధి.

విశ్రాంత లెఫ్టినెంట్​ జనరల్​ డీఎన్​ హూడా
(రచయిత 2016లో పాకిస్థాన్‌పై లక్షిత దాడులకు నాయకత్వం వహించారు)

ఇదీ చదవండి: నేతాజీకి భారతావని రుణపడి ఉంటుంది: మోదీ

ZCZC
PRI ESPL NAT
.KOCHI MES14
KL-WEATHER
Parts of Kerala experience warmest January
Kochi, Jan 23 (PTI) Some areas of middle Kerala are
experiencing warmest January with temperature touching new
heights for the season.
While Kottayam experienced 37 degrees Celsius as the
maximum temperature on Thursday, theCochin International
Airport Limited (CIAL) area in Ernakulam district has recorded
37.1 degree Celsius.
Earlier, the highest temperature was recorded at 36.6
degrees Celsius in January 30, 2017 in Kottayam.
Weather experts say the southern part of the country
experience high temperature and it is an "abnormal anomaly".
"This is a record. People are experiencing the temperature
of month of March in January", according to SAbhilash, joint
director of Advanced Centre for Atmospheric Radar Research,
Cochin University of Science and Technology (CUSAT).
He said drywind due to anticyclonic circulation was one
of the reasons for the situation.
This trend may continue for three to four days, he added.
PTI TGB
VS
VS
01232252
NNNN
Last Updated : Feb 18, 2020, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.