ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై ఐక్యంగా  పోరాడదాం' - pm urges for ndb

ఉగ్రవాదం కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఓ ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయిందని  బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రెజిల్‌లో 'వినూత్న భవిష్యత్ కోసం ఆర్థికవృద్ధి' ఇతివృత్తంతో జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాద నిర్మూలనకు సభ్యదేశాలు ఐక్యతతో కృషిచేయాలని సూచించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో బ్రిక్స్ కూటమి దేశాలు మరింత సహకారాన్ని పెంపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు.

'ఉగ్రవాదంపై ఐక్యంగా  పోరాడదాం'
author img

By

Published : Nov 15, 2019, 5:34 AM IST

Updated : Nov 15, 2019, 9:08 AM IST

'ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం'

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సమర్థించేది లేదని... మతం, జాతీయత, నాగరికతతో సంబంధంలేకుండా తీవ్రవాదాన్ని నేరపూరితమైన చర్యగానే భావించాలని బ్రిక్స్ దేశాల కూటమి సంయుక్తంగా ప్రకటించింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు బ్రిక్స్ దేశాలు ఐక్యంగా కృషిచేస్తాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అభివృద్ధి, శాంతి, శ్రేయస్సులకు.. ఉగ్రవాదం అనేది అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని మోదీ స్పష్టం చేశారు.

"గత పదేళ్లలో ఉగ్రవాదం బారినపడి 2.25 లక్షల మంది ప్రాణాలు కోల్పొయారు. ఫలితంగా కొన్ని సమాజాలు పూర్తిగా నాశనం అయ్యాయి. కొన్ని అంచనాల ప్రకారం ఉగ్రవాదం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 1 ట్రిలియన్ డాలర్ల నష్టం జరిగిందని సమాచారం. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవృద్ధి 1.5 శాతం తగ్గింది. ఉగ్రవాదం, ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహాయం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య రంగాలకు పరోక్షంగా నష్టం వాటిల్లుతోంది. ఉగ్రవాదంపై పోరాటంలో బ్రిక్స్​ కూటమి తొలిసారి సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

అందరిదీ ఒకటే మాట..

ఉగ్రవాదాన్ని సహించబోయేది లేదని.. మతం, జాతీయత, నాగరికతతో సంబంధంలేకుండా తీవ్రవాదాన్ని నేరపూరితమైన చర్యగానే భావించాలని బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా తీర్మానించాయి. ఉగ్రవాదంపై పోరాటానికి సభ్యదేశాలు అన్ని కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశాయి.

వాణిజ్యం...

బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించాలని మోదీ సూచించారు. ప్రపంచ వాణిజ్యంతో పోల్చితే... బ్రిక్స్ దేశాల మధ్యవాణిజ్యం కేవలం 15 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు.

"రాబోయే పదేళ్లలో... వాణిజ్యపరంగా బ్రిక్స్ దేశాలు పరస్పరం ఎలా సహకరించుకోవాలో చర్చించాల్సిన అవసరం ఉంది. వివిధ రంగాల్లో బ్రిక్స్ దేశాలు విజయం సాధించినప్పటికీ, ఇంకా చాలా రంగాల్లో వ్యాపార,వాణిజ్యాలు పెంపొందించుకునేందుకు అవకాశాలు గణనీయంగా ఉన్నాయి."

- మోదీ, భారత ప్రధాని

భారత్​కు ఎన్​డీబీ..

బ్రిక్స్ దేశాల కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూ డెవలప్​మెంట్​ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరగా భారత్​లో ఏర్పాటు చేయాలని బ్రిక్స్ వాణిజ్య కూటమిని అబ్యర్థించారు మోదీ. వచ్చే శిఖరాగ్ర సమావేశం నాటికి 500 బిలియన్ డాలర్ల ఇంట్రా-బ్రిక్స్ వాణిజ్య లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని సభ్యదేశాలను కోరారు.

పారిశుద్ధ్యం..

పట్టణ ప్రాంతాల్లో స్థిరమైన నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం ముఖ్యమైన సవాళ్లుగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

"జల నిర్వహణ' అంశంపై బ్రిక్స్ దేశాల జలవనరులశాఖ మంత్రులు తమ మొదటి సమావేశాన్ని భారత్​లో నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నా."

- మోదీ, భారత ప్రధాని

ఫిట్ ఇండియా ఉద్యమంభారత్​లో ఫిట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చామని మోదీ.. బ్రిక్స్ దేశాలకు తెలిపారు. భారత్​లో ఆరోగ్యం, శారీరక దారుఢ్యంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇదే విషయంలో భారత్​.. సభ్యదేశాలతో కలిసి పనిచేయాలనుకుంటోందని వెల్లడించారు.'వినూత్న భవిష్యత్​ కోసం ఆర్థికవృద్ధి'బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణ ఆఫ్రికా దేశాల కూటమి. ఈ ఏడాది బ్రెజిల్​లో 'వినూత్న భవిష్యత్​ కోసం ఆర్థికవృద్ధి' ఇతివృత్తంతో 11వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది.

ఇదీ చూడండి: 'వాతావరణ మార్పులతో.. పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు'

New Delhi, Nov 14 (ANI): Jawaharlal Nehru University (JNU) students continued to protest on Nov 14. They staged protest alleging that only a partial roll back in the fee was done. JNU admin building was blocked due to the continuous protest. JNU decided to partially roll-back hike proposed in hostel fees on Nov 13. "Timing clause will also be excluded from hostel manual," said JNU VC.
Last Updated : Nov 15, 2019, 9:08 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.