ETV Bharat / bharat

'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం - supreme court ayodhya verdict

దేశ చరిత్రలో ఇదో కొత్త మలుపు. శతాబ్ద కాలం నాటి సమస్యకు ముగింపు. దేశమంతా ఉద్విగ్నంగా ఎదురుచూసిన క్షణాలు.. సుప్రీం నిర్ణయాన్ని శాంతియుతంగా స్వాగతం పలికిన అద్భుత ఘడియలు! దేశ లౌకిక సిద్ధాంతాలు, భిన్నత్వ భావనలకు ఇబ్బందికరంగా మారిన అయోధ్య కేసుకు సర్వోన్నత న్యాయస్థానం తుది పరిష్కారం చూపింది. హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి బాటలు పరిచింది. ముస్లింల కోసం అయోధ్యలోనే 5 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్దేశించింది.

శ్రీరామ పట్టాభిషేకం
author img

By

Published : Nov 10, 2019, 5:01 AM IST

Updated : Nov 10, 2019, 7:16 AM IST

'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం

శతాబ్దంపైగా దేశాన్ని కుదిపేసిన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు ముగింపు పలికింది. దేశ ప్రజలను ఎంతో ఉత్కంఠకు గురిచేసిన ఈ కేసుపై శనివారం చారిత్రక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి మొత్తం కేసులో ఒక కక్షిదారు అయిన రామ్​ లల్లాకు చెందుతుందని స్పష్టం చేసింది.

3 నెలల్లో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి.. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోనే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్​ఏ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. రెవిన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వానికి చెందినదిగా తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని ప్రకటించింది. 1993 నాటి అయోధ్య చట్టంలోని సెక్షన్లు 6, 7 కింద దఖలు పడిన అధికారాల మేరకు.. కేంద్ర ప్రభుత్వం 3నెలల్లో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ట్రస్టీల నియామకం, విధివిధానాలను మూడు నెలల్లోపు రూపకల్పన చేయాలని నిర్దేశించింది. వివాదాస్పద స్థలం.. వెలుపలి, లోపలి భాగాలను ట్రస్ట్‌కు బదిలీ చేయాలని సూచించింది.

వివాదాస్పద స్థలంపై... నిర్మోహి అఖాడా, షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హతలు ఉంటే నిర్మోహి అఖాడాకు ట్రస్ట్‌లో భాగస్వామ్యం కల్పించాలని సూచించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ధర్మాసనం ఆదేశించింది. అయోధ్యలోనే ప్రముఖ ప్రాంతంలో 5ఎకరాలను కేంద్రం లేదా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని నిర్దేశించింది.

ఆధారాలను బట్టి తీర్పు..

నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నామని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే.. విశ్వాసాలు, నమ్మకాల మేరకు కాకుండా ఆధారాలను బట్టి తీర్పు ఇస్తున్నట్లు పేర్కొంది. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో కట్టలేదని.. పురావస్తు శాఖ నివేదిక చెబుతోందని పేర్కొంది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని.. పురావస్తు శాఖ నివేదికల్లో ఉందని ధర్మాసనం వెల్లడించింది. ఆ నిర్మాణాలకు ఇస్లామ్‌ మూలాలు లేవని పురావస్తు శాఖ వెల్లడించినట్లు పేర్కొంది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని నివేదికలో ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని కూడా న్యాయస్థానం స్పష్టంచేసింది.

అయోధ్యలోనే రాముడు..

రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశమన్న న్యాయస్థానం.. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందూవులు విశ్వసిస్తున్నారని పేర్కొంది. రామజన్మ భూమి న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చుకానీ... ఇక్కడ రాముడే కక్షిదారుడని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రధాన గుమ్మటం కిందే శ్రీరాముడు జన్మించాడని హిందువులు విశ్వసిస్తారని ధర్మాసనం పేర్కొంది. రెండు మతాలవారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని.. ముస్లింలు కూడా విశ్వసిస్తారని వ్యాఖ్యానించింది. మొఘులుల సమయం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. శుక్రవారం నాడు ముస్లింలు ప్రార్థనలు చేసినట్టు మాత్రమే సున్నీ వక్ఫ్‌ బోర్డు ఆధారాలు సమర్పించిందని తెలిపింది.

'ముస్లింలు లోపల.. హిందువులు బయట'

వివాదాస్పద స్థలంలో.. ముస్లింలు లోపల, హిందువులు బయట ప్రార్థనలు చేసేవారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి వ్యాఖ్యానించారు. 1856-57కు ముందు లోనికి వెళ్లే హక్కు హిందువులకు ఉండేది కాదన్న ధర్మాసనం.. ఆ సమయంలో పక్కనే ఉండే రామ్ చబుత్రాలో హిందువులు పూజలు చేసేవారని పేర్కొంది. 1949లోనే ఆ స్థలం హిందువుల అధీనంలోకి వచ్చిందని కోర్టు వెల్లడించింది. వివాదస్పద స్థలం వద్ద.. సీతా రసోయి, రామ్‌ చబుత్రా, బందర్ గృహ్ ఉండడం ఆధ్యాత్మిక సత్యానికి నిదర్శమని పేర్కొంది. 1949 తర్వాత.. ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్టు లేదా ప్రార్థనలు చేస్తున్నట్టు ముస్లింలు నిరూపించలేదని ధర్మాసనం పేర్కొంది. వివాదాస్పద స్థలంపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు ముస్లింలు నిరూపించలేకపోయారని వెల్లడించింది. రెండు వర్గాలు సామరస్యంగా ప్రార్థనలు చేసుకునేందుకు 1886లో వివాదాస్పద స్థలం చుట్టూ రెయిలింగ్‌ ఏర్పాటు చేశారని పేర్కొంది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేదానికి ఆధారాలున్నాయని స్పష్టంచేసింది.

ట్రస్టు ద్వారా ఆలయం..

భూమిపై నేరుగా ఎవరికీ కోర్టు హక్కులు కల్పించలేదు. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వ రిసీవర్​కు అప్పగించాలని, రిసీవర్​, ట్రస్టుకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇన్నర్​ కోర్టు యార్డు (బాబ్రీ మసీదు గుమ్మటాల కింద భాగం), అవుటర్​ కోర్టు యార్డు (గుమ్మటాల వెలుపలి భాగం) సహా వివాదాస్పద ప్రాంతం మొత్తం రామ్​లల్లా విరాజ్​మాన్​కు దక్కుతుంది. అయితే ఈ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా నియమించే ఒక ట్రస్టుకు అప్పగించాలి. ఆ ట్రస్టు ద్వారానే ఆలయ నిర్మాణం సాగాలి. అయోధ్య చట్టంలోని నిర్దిష్ట ప్రాంత భూసేకరణ-1993లోని 6,7 సెక్షన్ల కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఒక్క స్కీమ్​ను రూపొందించాలి. ఒక ట్రస్టు లేదా ట్రస్టీల బోర్డు లేదా మరేదైనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇన్నర్​, ఔటర్​ కోర్టు యార్డులను సదరు ట్రస్టుకు అప్పగించాలి. మిగతా భూమిని ట్రస్టుకు అప్పగించే అంశంపై నిబంధనలను రూపొందించే అంశంపై ప్రాతినిధ్యం ఉండాలి. ట్రస్టుకు వివాదాస్పద భూ కేటాయింపు, సున్నీ సెంట్రల్​ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమిని అప్పగించడం ఏకకాలంలో జరగాలి. కేటాయించిన భూమిలో మసీదు, ఇతర సౌకర్యాలను నిర్మించుకోవడానికి సున్నీ సెంట్రల్​ వక్ఫ్​బోర్డుకు అన్ని అధికారాలూ ఉంటాయి.

సయోధ్య తీర్పు..

2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌ లల్లాలు సమానంగా పంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ 2010లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు దాఖలు కాగా.. 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తొలుత మధ్యవర్తిత్వానికి అవకాశమిచ్చినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 16 వరకూ రోజువారీ విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం రాముడికే చెందుతుందని శనివారం వెలువరించిన 1045 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Alverca do Ribatejo, Portugal. 8th November 2019.
1. 00:00 GOAL: Tiago Morgado scores long-distance freek-kick
2. 00:13 Various replays
SOURCE: Canal 11
DURATION: 00:24
STORYLINE:
A thunderous 35-yard free-kick was scored in the third tier of Portuguese football on Saturday.
Tiago Morgado of Real S.C. scored the thumping opener in his team's 2-0 win over Campeonato de Portugal Group D opponents Alverca.
Last Updated : Nov 10, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.