అనుమానం అనే రాకాసి.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మహిళను చిత్రవధకు గురిచేసింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో కట్టుకున్న భర్త ఆమె జుట్టు కత్తిరించాడు.
ఇదీ జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్ జిల్లాకు చెందిన ఆరిఫ్, రోష్ని భార్యభర్తలు. వారికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మొదటి నుంచి తన భార్యను అనుమానిస్తుండేవాడు ఆరిఫ్. రోష్ని వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుకునేవాడు. ఆ అనుమానం తారస్థాయికి చేరి.. తన భార్యను ఇంకెవరూ చూడకూడదని భావించి అమె జుట్టును కత్తిరించాడు. ఆ తర్వాత రోష్నిని ఇంట్లో నిర్బంధించాడు.
రోష్ని ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకుని స్థానిక లిసాడీ గేట్ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది. తన భర్తకు తనపై అనుమానం ఎక్కువని, ఆ కారణంతోనే కొట్టేవాడని వివరించింది. ఈ విషయంలో తన అత్త కూడా ఆరిఫ్‌కు మద్దతిచ్చేదని వాపోయింది. తనవైపు ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతోనే జట్టును కత్తిరిస్తున్నట్లు ఆరిఫ్ చెప్పాడని.. ఆమె ఫిర్యాదులో పేర్కొంది.