ETV Bharat / bharat

లైవ్​: 'మహా' బలపరీక్షపై రేపే సుప్రీం నిర్ణయం - 'మహా రాజకీయాలపై' మరికాసేపట్లే సుప్రీం విచారణ

'మహా రాజకీయాలపై' మరికాసేపట్లే సుప్రీం విచారణ
author img

By

Published : Nov 24, 2019, 10:58 AM IST

Updated : Nov 24, 2019, 1:55 PM IST

12:49 November 24

మహారాష్ట్ర అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమా? అనే అంశాన్ని పరీశిలించిన సుప్రీం కోర్టు. సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా గవర్నర్‌కు అందించిన మద్దతు లేఖలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. సోలిసిటర్‌ జనరల్‌ లేఖలు సమర్పించిన తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు సుప్రీంను ఆశ్రయించాయి. పిటిషన్​పై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. శివసేన పక్షాన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు ఏర్పడ్డ శివసేన, భాజపా పొత్తు విఫలమైందని ధర్మాసననానికి వివరించారు. తిరిగి ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త కూటమి ఏర్పాటైందని తెలిపారు. ఈ నెల 22న రాత్రి 7గంటలకు పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయని,  అయితే ఎవరికి తెలియకుండా 23న ఉదయం కొత్త ప్రభుత్వ ఏర్పాటైందని కోర్టుకు తెలిపారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసి భాజపా నేత ఫడణవీస్‌తో సీఎంగా.. గవర్నర్‌ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పారు.

అయితే  ఈ క్రమంలో గవర్నర్‌కు సమర్పించిన మద్దతు పత్రాలపై ఏమైనా సమాచారం ఉందా అని సిబల్‌ను జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశ్నించగా.. లేదని సిబల్‌ సమాధానమిచ్చారు. ఈరోజే బలనిరూపణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కర్ణాటకలో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయని.. అక్కడ 24 గంటల్లో బలపరీక్షకు ఆదేశాలిచ్చారని ధర్మాసనానికి సిబల్‌ గుర్తుచేశారు. అవసరమైతే కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కూటమి రేపే బలనిరూపణను సిద్ధంగా ఉన్నాయన్నారు. కేబినెట్‌ నిర్ణయంతో అమలులోకి వచ్చిన రాష్ట్రపతి పాలన తిరిగి కేబినెట్‌ ఆమోదం లేకుండా ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. అలాగే గవర్నర్‌ వ్యవహరించిన తీరును సిబల్‌ ధర్మాసనం ముందు తప్పుబట్టారు. ఏ నిబంధనల ప్రకారం గవర్నర్‌ భాజపాకు అవకాశం ఇచ్చారో తెలియజేయాలని కోరారు. ఏ మద్దతు పత్రాల్ని చూశారు, ఎంతమంది ఎమ్మెల్యేల సంతకాల్ని రాత్రికి రాత్రే పరిశీలించారో బయటి ప్రపంచానికి తెలియజేయాలన్నారు. 

ఎన్సీపీ-కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్‌ మను సింఘ్వీ దాదాపు ఇదే తరహా అంశాల్ని లేవనెత్తారు. అలాగే కర్ణాటక, గోవాలో జరిగిన పరిణామాల్ని, పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఈ సందర్భంగా ధర్మాసనం ముందుంచారు. అనంతరం భాజపా తరఫున వాదనలు ప్రారంభించిన ముకుల్‌ రోహత్గి.. హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ఆదివారం రోజు అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. దీన్ని విచారణకు స్వీకరించాల్సిన అవసరం కూడా లేదన్నారు. వాదనలు విన్న అనంతరం రేపు ఉదయం 10.30 కల్లా గవర్నర్​కు అందించిన మద్దతు లేఖలను  సమర్పించాలని.. అనంతరం బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం స్పష్టం చేసింది.

12:34 November 24

బలపరీక్షపై రేపే సుప్రీం నిర్ణయం...

  • మహారాష్ట్ర అంశంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
  • మహారాష్ట్ర గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు
  • గవర్నర్‌కు ఇచ్చిన మద్దతు లేఖలు సమర్పించాలని కేంద్రానికి ఆదేశం
  • రేపు ఉదయం 10.30 గంటలకల్లా మద్దతు లేఖలు సమర్పించాలి: సుప్రీంకోర్టు
  • సోలిసిటర్ జనరల్ లేఖలు సమర్పించిన తర్వాత బలపరీక్షపై నిర్ణయం: సుప్రీంకోర్టు
  • ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

12:26 November 24

ముకుల్​ రోహత్గి వాదనలు

  • అధికరణం  361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర‌్లు  కోర్టులకు జవాబుదారీకాదు: ముకుల్‌ రోహత్గి
  • గవర్నర్‌ చర్యను తప్పుబట్టడానికి వీల్లేదు, స్వీయ విచక్షణపై ఆయన ఎవరినైనా నియమించవచ్చు: ముకుల్‌ రోహత్గి
  • గవర్నర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ఇవాళే తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు: ముకుల్‌ రోహత్గి
  • ఈ వ్యవహారంలో  జవాబు చెప్పేందుకు మూడు రోజుల సమయం ఇవ్వండి: రోహత్గి
  • కోర్టును సభలు గౌరవిస్తాయి. అలాగే సభలను కోర్టులు గౌరవించాలి: రోహత్గి
  • ఈ పిటిషన్‌ అసలు చెల్లుబాటే కాదు, నోటీసే లేకుండా ఆదేశాలు జారీ చేయమని సిబల్‌  చేస్తున్న వాదన సరికాదు: రోహత్గి

12:11 November 24

'మెజార్టీ ఉంటే ఎందుకు భయం..?'

పోటీపడుతున్న పార్టీల మధ్య బలపరీక్ష నిర్వహించే ఏకైక అజెండాతో సభ జరగాలని సింఘ్వీ.. సుప్రీంను కోరారు. ప్రభుత్వానికి ఎన్​సీపీ మద్దతు లేదని... సంఖ్యాబలం, మెజార్టీపైనే ప్రజాస్వామ్యం పనిచేస్తుందన్నారు. మెజార్టీ తమకు ఉందని చెప్పిన వారు ఇప్పుడు బలపరీక్ష అంటే ఎందుకు బెంబేలెత్తుతున్నారని సింఘ్వీ ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సంఖ్య 145. ఎన్నికలకు ముందున్న పొత్తు రద్దయింది కనుక.. ఇప్పుడు ఎన్నికల తర్వాత పొత్తులు చూడాలని సింఘ్వీ వాదించారు.  ఈ వ్యవహారంలో గవర్నర్‌ పార్టీ కాదు, ప్రజాస్వామ్యంలో బలపరీక్ష అన్నది రాజ్యాంగపరమైన బాధ్యతని అభిషేక్‌ సింఘ్వి ప్రస్తావించారు. బలపరీక్షకు నోటీసు, కౌంటర్లు అవసరం లేదని వాదించారు.

12:08 November 24

బలపరీక్ష కావాలి...

  • ఎన్​సీపీ- కాంగ్రెస్​ తరఫున అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు
  • సభలో బలపరీక్ష నిర్వహిస్తే సందేహాలన్నీ తొలగిపోతాయి: సింఘ్వి
  • అజిత్‌ పవార్‌ శాసనసభాపక్ష నేత కాదు, ఆయనకు బలమే లేనప్పుడు ఆయన ఎలా పదవిలో కొనసాగుతారు: సింఘ్వి

11:49 November 24

'గవర్నర్​కు ఎవరో ఆదేశాలు ఇస్తున్నారు'

  • గవర్నర్‌కు ఎవరో నేరుగా ఆదేశాలు ఇస్తున్నారు, లేదంటే ఇలాంటివి జరగవు: కపిల్ సిబల్‌
  • రాష్ట్రపతి పాలన ఎత్తివేసేలా గవర్నర్ రాత్రికి రాత్రే ఎలా సిఫార్సు చేశారు?: సిబల్
  • ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ నుంచి కనీసం లేఖ కూడా లేదు: కపిల్‌ సిబల్‌
  • రాష్ట్రపతి పాలన తొలగించాలని గవర్నర్‌ సిఫార్సు చేయటం పక్షపాతం, దురుద్దేశంతో కూడుకున్నది: కపిల్‌ సిబల్‌
  • భాజపాకు బలముంటే వెంటనే బలపరీక్ష ఎదుర్కోవాలి: కపిల్‌ సిబల్‌
  • వాళ్లకు మెజార్టీ ఉంటే తక్షణం నిరూపించుకోవాలి, లేదంటే మాకు అవకాశం ఇవ్వాలి: కపిల్‌ సిబల్‌
  • కర్ణాటక విషయంలో 24 గంటల్లోనే బల పరీక్షకు అదేశాలిచ్చారు: కపిల్‌ సిబల్

11:43 November 24

విచారణ మొదలు...

  • మహారాష్ట్ర అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
  • విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
  • విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, అశోక్‌ భూషణ్‌, సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం
  • కాంగ్రెస్‌ తరఫున వాదనలు వినిపిస్తోన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్
  • భాజపా తరఫున వాదనలు వినిపిస్తోన్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి
  • ఫడణవీస్ ప్రభుత్వానికి ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని పిటిషన్‌లో కోరిన 3 పార్టీలు
  • ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం లేకుండా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలన్న పార్టీలు
  • సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని 3 పార్టీల విజ్ఞప్తి
  • తమకు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు పేర్కొన్న 3 పార్టీలు

11:36 November 24

సుప్రీంలో మొదలైన విచారణ...

రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని 24 గంటల్లోపు విశ్వాసం నిరూపించుకొనేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. పిటిషన్‌లో ప్రధానంగా మూడు అంశాలపై పిటిషనర్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కోరారు.

మెజార్టీ లేని ఫడణవీస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలన్నారు. కూటమి నేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బేరసారాలు, చట్టవ్యతిరేక చర్యలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాసపరీక్ష జరిగేలా ఆదేశించాలని ఈ మూడు పార్టీలు కోర్టుకు విన్నవించాయి
 
11:07 November 24

'ఫడణవీస్ సీఎం అని ప్రజలకే తెలియదు'

  • ఫడణవీస్‌ సీఎం అని మహారాష్ట్ర ప్రజలకే తెలియదు: శివసేన నేత సంజయ్‌ రౌత్‌
  • భాజపా పూర్తిగా ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం చేస్తోంది: సంజయ్‌రౌత్‌
  • శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమికి స్పష్టమైన బలం ఉంది: సంజయ్‌రౌత్‌
  • శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: సంజయ్‌రౌత్‌
  • ప్రజాస్వామ్య చరిత్రలోనే నిన్న చీకటి రోజు: శివసేన నేత సంజయ్‌ రౌత్‌
  • రాష్ట్రపతి భవన్‌, రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేయడం ఇంతకు ముందెన్నడూ లేదు: రౌత్

11:01 November 24

అజిత్​ పవార్​ చేసిన అతిపెద్ద తప్పు ఇదే..!

తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. భాజపా, అజిత్​పవార్ సరైన అడుగు వేయలేదని వ్యాఖ్యానించారు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​లకు 165మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. అజిత్​ పవార్ ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదేనని వ్యాఖ్యానించారు రౌత్. పెద్ద వయస్సులో శరద్​ పవార్​ను కష్టపెడుతున్నారని వ్యాఖ్యానించారు.

10:47 November 24

'మహా రాజకీయం'పై సుప్రీంలో విచారణ

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఫడణవీస్​ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన దాఖలు చేసిన పిటిషన్​పై మరికాసేపట్లో అత్యున్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టనుంది. జస్టిస్​ రమణ, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కేసును విచారించనుంది.

రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన సిద్ధమవుతున్న వేళ.. శనివారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడణవీస్​.. ఉపముఖ్యమంత్రిగా ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలనను అందిస్తామని ఫడణవీస్​ ధీమా వ్యక్తం చేశారు.

అయితే మెజారిటీ లేని ఫడణవీస్​ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాయి మూడు పార్టీలు. కూటమి నేత ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించేలా గవర్నర్​కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాస పరీక్ష జరిగేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించాయి.

ముంబయి హోటళ్లల్లో రాజకీయాలు...

ఫడణవీస్​ చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.. బల పరీక్షకు ఈ నెల 30 వరకు గడువునిచ్చారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను ముంబయి హొటల్​కు తరలించింది ఎన్​సీపీ పార్టీ. బలపరీక్ష జరిగే వరకు ఎమ్మెల్యేలు అక్కడే ఉండనున్నారని సమాచారం.

ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు సహకరించి సంచలనం సృష్టించిన అజిత్​ పవార్​... శనివారం రాత్రి తన సోదరుడు శ్రీనివాస్​ పవార్​తో భేటీ అయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చలపై స్పష్టత లేదు.

మరోవైపు.. అజిత్​ పవార్​ను పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది ఎన్​సీపీ. ఆ బాధ్యతలను సీనియర్​ నేత జయంత్​ పాటిల్​కు అప్పగించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid, Spain - 23rd November 2019.
+++ TRANSCRIPTIONS TO FOLLOW +++             
1. 00:00 SOUNDBITE (English): Rafael Nadal, Spain:
3. 02:23 SOUNDBITE (Spanish): Rafael Nadal,world number one:
Client Note +++This soundbite is for the benefit of our Spanish-speaking clients+++
3. 03:39 SOUNDBITE (English): Jamie Murray, Great Britain:
SOURCE: Kosmos
DURATION: 05:17
STORYLINE:
Rafael Nadal and Jamie Murray react after Spain beat Great Britain on Saturday in Madrid to reach the Davis Cup Final.
Last Updated : Nov 24, 2019, 1:55 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.