మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న హస్తం పార్టీ నేత మురికి కాలువలు శుభ్రం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల పురపాలకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రధుమన్ సింగ్ తోమర్.. గాల్వియర్ నియోజకవర్గంలోని బిర్లానగర్లో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టారు. స్థానిక 16వ వార్డులోని మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు.
ఎనిమిది అడుగుల లోతున్న ఈ కాలువ చాలా రోజులగా శుభ్రపరచకపోవడం వల్ల దుర్గంధంతో నిండిపోయింది. చెత్త పేరుకుపోవడం వల్ల మురికి నీరు ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. ప్రజా సమస్య తెలుసుకున్న నేత.. వెంటనే ఇలా పారతో కాలువలోకి దిగి చెత్తను బయటకు తీశారు.
ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ప్రధుమన్.. 'ఆల్ ఈజ్ వే' సందేశాన్ని ఇచ్చారు. ప్రధుమన్ నియోజకవర్గం వ్యాప్తంగా 30 రోజుల పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం చేపట్టాలని సంకల్పించారు. ఆ క్రమంలోనే ఇలా పారా చేతబట్టి మోరీలోకి దిగారు ఈ నేత.
ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం