నిరంతరం సభలు, సమావేశాలతో తీరికలేకుండా గడిపే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం సరదాగా కత్తి తిప్పారు. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విద్యార్థులతో కలిసి స్టెప్పులు కూడా వేయడంతో ఆ సన్నివేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి ప్రదర్శించిన అభినయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర జౌళి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ‘మహిళా అభ్యుదయ సదస్సు’కు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రసిద్ధ సంప్రదాయ నృత్యమైన ‘తల్వార్ రాస్’కు అభినయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి స్మృతి కూడా వారితో కలిసి నృత్యం చేశారు.
వెనుక నిల్చున్న చిన్నారులందరూ తలపాగాలు ధరించి, రెండు చేతులతో కత్తులు తిప్పుతుండగా.. కేంద్రమంత్రి వారిని అనుకరిస్తూ చేతుల్లో ఉన్న కరవాలాలు ఝుళిపించారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు జీతూ వాఘాని కూడా హాజరయ్యారు.
-
WOW!! Amazing! #NariShakti
— Shalini Bajpai 👧 (@sbajpai2811) November 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Sword Dance performed by #SmritiIrani ji
Union Minister @smritiirani displaying her skills with holding sword in both hands at a function in #Swaminarayan Gurukul, Gujarat#WomenEmpowerment@SmritiIraniOffc #FridayMotivation pic.twitter.com/rF5XJQFAHL
">WOW!! Amazing! #NariShakti
— Shalini Bajpai 👧 (@sbajpai2811) November 15, 2019
Sword Dance performed by #SmritiIrani ji
Union Minister @smritiirani displaying her skills with holding sword in both hands at a function in #Swaminarayan Gurukul, Gujarat#WomenEmpowerment@SmritiIraniOffc #FridayMotivation pic.twitter.com/rF5XJQFAHLWOW!! Amazing! #NariShakti
— Shalini Bajpai 👧 (@sbajpai2811) November 15, 2019
Sword Dance performed by #SmritiIrani ji
Union Minister @smritiirani displaying her skills with holding sword in both hands at a function in #Swaminarayan Gurukul, Gujarat#WomenEmpowerment@SmritiIraniOffc #FridayMotivation pic.twitter.com/rF5XJQFAHL
ఇదీ చూడండి:ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై సీబీఐ కేసు