మధ్యప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రిలో గంటల వ్యవధిలోనే ఆరుగురు గిరిజన చిన్నారులు మరణించడం కలకలం రేపింది. గత అర్ధరాత్రి షాడోల్ ఆస్పత్రిలో వీరు ప్రాణాలు విడిచారు. వీరిలో ఒకరు పుట్టి ఒక రోజేకాగా మిగిలిన వారి వయసు రెండున్నర నెలలు.
చిన్నారుల మరణాలపై మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి తులసి సిలావత్ దర్యాప్తునకు ఆదేశించారు.
"ఆ చిన్నారులు విషమ పరిస్థితిలో ఆస్పత్రిలోని సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ)లో చేరారు. కానీ వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరణాలకు అసలు కారణాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలోనూ విచారణ జరుగుతుంది."-డాక్టర్ రాజేష్ పాండే, ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యుడు
ఆస్పత్రిని గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కమ్లేశ్వర్ పటేల్ సందర్ళించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.