ETV Bharat / bharat

ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా?

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని 50:50 ఫార్ములా ప్రకారం పంచుకోవాలన్న నిర్ణయంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో శివసేన ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తోందా? ఎన్సీపీ, కాంగ్రెస్​లతో కలిసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శివసేన నేత సంజయ్​ రౌత్​ నుంచి వచ్చిన సందేశాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టారు ఎన్సీపీ సీనియర్​ నేత అజిత్​ పవార్​.

మహాపీఠం: ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా?
author img

By

Published : Nov 3, 2019, 7:15 PM IST

Updated : Nov 3, 2019, 11:41 PM IST

మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి శివసేన.. ఎన్సీపీ మద్దతు కోరనుందా అనే అనుమానాలకు తావిస్తున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. భాజపాతో ముఖ్యమంత్రి పీఠంపై సందిగ్ధత నెలకొన్నందున.. ఎన్సీపీ, కాంగ్రెస్​లతో పొత్తు కోసం సేన ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా తాజాగా ఓ సంఘటన జరిగింది. శివసేన పార్టీ నేత సంజయ్​ రౌత్ నుంచి​ తనకు సందేశం వచ్చిందని ఎన్సీపీ సీనియర్ నేత అజిత్​ పవార్​ వెల్లడించారు.

ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా?

సంజయ్​ రౌత్​ నుంచి వచ్చిన సందేశాన్ని మీడియా సమావేశంలో చదివి వినిపించారు అజిత్​ పవార్. రౌత్​ సందేశానికి స్పందనగా తానే స్వయంగా ఫోన్​ చేసి మాట్లాడతానన్నారు.

'నమస్కారం నేను సంజయ్​ రౌత్​, జై మహారాష్ట్ర.. అని రౌత్ సందేశం పంపారు. దీని అర్థం నేను ఆయనకి ఫోన్​ చేయాలని. ఫోన్​ చేసి విషయమేంటో కనుక్కుంటా.'- అజిత్​ పవార్, ఎన్సీపీ సీనియర్​ నేత.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా, శివసేన మధ్య సయోధ్య కుదరడం లేదు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని ఎన్సీపీ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే తాజా రాయకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు ఎన్సీపీ అధినేత శరద్​పవార్. వీరి భేటీ తర్వాత శివసేనకు మద్ధతిచ్చే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తమకు 170 ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఈరోజు రౌత్​ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చను లేవనెత్తాయి. శివసేనకు కాంగ్రెస్​, ఎన్సీపీ మద్దతిస్తాయా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

AP Video Delivery Log - 0900 GMT News
Sunday, 3 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0849: Iraq Roadblocks AP Clients Only 4237954
Baghdad roadblocks as anti-gov't protests continue
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 3, 2019, 11:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.