సోలార్ స్కూటీని నడుపుతున్న ఇతని పేరు విజయ్‌కుమార్. హసన్‌లోని మలేనాడు టెక్నికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు సౌర శక్తితో నడిచే స్కూటర్‌ను రూపొందించారు. దీనికోసం అనేక పరిశోధనలు చేశారు.
గంటకు 49 కిలోమీటర్లు
విజయ్‌కుమార్ తయారు చేసిన సోలార్ స్కూటర్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. స్కూటీ నిర్మాణం కోసం సోలార్ పలకలతో పాటు.. పాత పరికరాలను ఉపయోగించారు. తేలికపాటి ఇంజన్‌తో నడవటం దీని ప్రత్యేకత. గంటకు 49 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ స్కూటర్ ప్రయాణించగలదు.
సౌర విమానం కోసం ప్రయత్నాలు
విజయ్ కుమార్ పరిశోధనలు కేవలం సోలార్ స్కూటర్ వరకే పరిమితం కాలేదు. ఆయన పరిశోధనాభిరుచి అనేక ఇతర గృహోపకరణాల రూపకల్పనకూ బీజం వేసింది. సౌర శక్తితో నడిచే ఎయిర్ కూలర్, వాక్యూమ్ క్లీనర్‌లను తయారు చేశారు. అంతే కాకుండా సౌర శక్తితో నడిచే తేలికపాటి విమానం కోసం పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుత పరిశోధనలు ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో తక్కువ ఖర్చుతో వాణిజ్య పరంగా వాహనాలను ఉత్పత్తి చేస్తానని విజయకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.