ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఊరట లభించింది. రఫేల్ యుద్ధ విమానాల కోనుగోళ్ల వ్యవహారంలో కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 2018 డిసెంబరు 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
36 రఫేల్ యుద్ధవిమాన కొనుగోళ్ల ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని తేల్చి చెప్పింది సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవట్లేదని తెలిపింది.
రఫేల్ ఒప్పందంలో వాస్తవ విషయాల్ని కోర్టుకు చెప్పకుండా కేంద్రం తొక్కిపెట్టిందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు.
రాహుల్‌కు ఊరట
రఫేల్ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో రాహుల్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని హెచ్చరించింది.
ఇదీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ: సుప్రీం