సాయి జన్మభూమిపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. మహారాష్ట్ర పర్బనీ జిల్లా పాథ్రీ.. సాయి జన్మస్థానమని వస్తున్న వాదనలు.. రాజకీయ వివాదానికి దారి తీస్తోంది. పాథ్రీ అభివృద్ధి కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే 100 కోట్లు విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో సాయి కర్మభూమిగా భావించే శిరిడీలో ఆందోళనలు మొదలయ్యాయి. పాథ్రీ అభివృద్ధిని తాము వ్యతిరేకించట్లేదని.. తమ బాధ అంతా సాయి జన్మభూమిగా ప్రచారం చేయటమేనని శిరిడీ వాసులు చెబుతున్నారు.
సమ్మె బాట..
ఈ ప్రచారాన్ని నిరసిస్తూ శిరిడీలో ఆదివారం నుంచి సమ్మె చేపట్టాలని స్థానికులు నిర్ణయించారు. చరిత్రలో మొదటిసారి శిరిడీ మూతపడనుంది. అయితే ఆలయాన్ని మాత్రం మూసివేయమని ఆందోళనకారులు తెలిపారు.
శిరిడీకి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నిర్ణయంతో భక్తులు, పర్యటకులపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని రెండు రోజుల ముందుగా ప్రకటన చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'