ETV Bharat / bharat

పల్లెలు తేరుకొంటేనే.. దేశ ప్రగతి! - Rural development is the diversion of limited resources, employment guarantee and rural roads.

పల్లెటూళ్లే దేశానికి పట్టుకొమ్మలు... అలాంటిది గ్రామాలను, వాటి అభివృద్ధిని పూర్తిగా మరిచారు పాలనాధికారులు. ఎలాంటి వస్తువులు రూపుదిద్దుకోవాలన్నా దానికి పల్లెటూళ్లే ఆధారం. ప్రజల చేతుల్లో సొమ్ములు ఆడేలా చూసి వస్తూత్పత్తులకు గిరాకీ పెంచాలన్నదే ఆర్థికవేత్తల మాట. గ్రామీణార్థిక వ్యవస్థ కుంగుబాటుకు లోనవుతుంది కాబట్టే దేశం ‘అభివృద్ధి మాంద్యం’లో కూరుకుపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ అన్నారు. కాబట్టి పల్లెటూళ్లలో ఉండే పరిమిత వనరుల్ని పెంచాలి, రైతుల కోసం చెేపట్టిన పథకాలు సక్రమంగా అమలయ్యేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాబోయే బడ్జెట్​లో అవసరమైన నిధులను కేటాయించి సత్వర పరిష్కారమార్గం సూచించాలని రఘురామ్​రాజన్​ పేర్కొన్నారు.

rural-development-is-the-diversion-of-limited-resources-employment-guarantee-and-rural-roads
పల్లెలు తేరుకొంటేనే... దేశ ప్రగతి.!
author img

By

Published : Jan 30, 2020, 7:11 AM IST

Updated : Feb 28, 2020, 11:40 AM IST

భారతావని ఆత్మ గ్రామాల్లోనే ఉందన్నారు మహాత్మాగాంధీ. పల్లెపట్టుల సమస్యల్ని పట్టించుకోని పాలకుల ఉపేక్షాభావంతో ఆ ‘ఆత్మ’ క్షోభిస్తే దేశార్థికమే ఎంతటి సంక్షోభంలో కూరుకుపోతుందో నడుస్తున్న చరిత్ర ఎలుగెత్తి చాటుతోంది. బిస్కెట్లకు సైతం గిరాకీ పడిపోయి అన్ని రంగాలనూ తాకిన మాంద్యం సెగ, ప్రత్యక్ష పరోక్ష పన్ను రాబడుల్లో ఎకాయెకి రెండు లక్షల కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ బొక్కసానికీ బొర్రె పెడుతోంది. ఉరుముతున్న మందగమనం ఉద్యోగాల్ని ఊడ్చేస్తుంటే దాని కట్టడి కోసం కార్పొరేట్‌ సుంకాల కోత సహా పలు రంగాలకు ఉద్దీపన చర్యల్ని ప్రకటించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయిన నేపథ్యంలో ఎల్లుండి రానున్న కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ముప్పిరిగొన్నాయి. బడ్జెట్‌ సన్నాహకాల్లో భాగంగా అన్ని వర్గాలనుంచీ కేంద్రం ఎన్నెన్ని సూచనలు రాబట్టినా- ప్రస్తుత సంక్షోభంనుంచి గట్టెక్కడానికి అందరూ సూచిస్తున్న మార్గం ఒక్కటే. ప్రజల చేతుల్లో సొమ్ములు ఆడేలా చూసి వస్తూత్పత్తులకు గిరాకీ పెంచాలన్నదే! గ్రామీణార్థికం కుంగుబాటుకు లోను కాబట్టే దేశం ‘అభివృద్ధి మాంద్యం’లో కూరుకుపోతోందన్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌- పరిమిత వనరుల్ని ఉపాధి హామీ, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటివాటికి మళ్ళించడం ద్వారా అక్కడి పేదలకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని ఏడువారాల క్రితమే సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తొలి ఎనిమిది నెలల్లో ఖర్చు చేసిన బడ్జెట్‌ కేటాయింపులు 70శాతం; అదే ఈ ఆర్థిక సంవత్సరం వ్యయీకరించింది కేవలం 49 శాతం! బడుగు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ అంటూ కిసాన్‌ సమ్మాన్‌ నిధికి కేటాయింపులు రూ.75 వేల కోట్లు అయినా మొన్న డిసెంబరు చివరి నాటికి ఖర్చు చేసింది 57.6శాతం! చేసిన పనికి కూలి డబ్బులూ సకాలంలో అందక ‘ఉపాధిహామీ’ విలవిల్లాడుతుంటే, మొత్తంగా గ్రామీణార్థికమే దెబ్బతిన్న దుష్ప్రభావం- దేశ ప్రగతి రథ గమనాన్నే మందగింపజేస్తోంది. పల్లెల్ని ఆదుకొంటే అవే దేశార్థికాన్ని చేదుకొంటాయన్న ప్రాప్తకాలజ్ఞతతో సవ్యపథంలో బడ్జెట్‌ విధాన సేద్యం సాగాలి!

'పీఎమ్‌-కిసాన్‌' నామ మాత్రమే

‘మేము చేసే ప్రతి పనిలోనూ ‘పల్లెలు పేదలు రైతుల’ ప్రయోజనాలే కీలకంగా ఉంటాయి’- నిరుడు జులై మొదటివారంలో కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన మాట అది. ప్రస్తుతం 3000 కోట్ల డాలర్లుగా ఉన్న వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్ని 2022కల్లా రెట్టింపు చెయ్యాలన్న ప్రకటనలు ఓ వంక మోతెక్కుతున్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో అవి 16శాతం పడిపోయాయంటే ఏమనుకోవాలి? ఎరువుల సబ్సిడీని కూడా కలుపుకొంటే గత బడ్జెట్లో గ్రామాలకు కేటాయించిన మొత్తం రూ.3.40 లక్షల కోట్లు! ఎకాయెకి 70శాతం జనావళి నివసించే లక్షలాది పల్లెలకు బడ్జెట్లో కేవలం 12శాతం నిధుల కేటాయింపుతో గ్రామాభ్యుదయం ఎలా సాధ్యమో అర్థం కాదు. స్థూల దేశీయోత్పత్తిలో గ్రామాలు సమకూరుస్తున్నది 30శాతం; 50శాతం ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయం వాటా 15శాతమే! రెండు హెక్టార్లలోపు సాగుభూమిగల చిన్న సన్నకారు రైతుల సంఖ్య 86శాతానికి పైబడిందని, కుటుంబ పోషణకు సరిపడ తప్ప అదనపు ఉత్పత్తి ఆయా రైతులకు సాధ్యం కావడంలేదనీ గుర్తించాల్సిందే. అలాంటి రైతుల కోసమే తెచ్చిన ‘పీఎమ్‌-కిసాన్‌’ ద్వారా బడుగు రైతు కుటుంబాలకు దక్కే భరోసా నామమాత్రం. దళారి వ్యవస్థ నిర్మూలనకోసమన్న ‘ఈ-నామ్‌’ వేదిక ఏర్పాటు, వచ్చే అయిదేళ్లలో కొత్తగా పదివేల రైతు ఉత్పాదక సంస్థల కూర్పు ద్వారా సన్నకారు రైతులకు ఏం ఒరుగుతుందన్నది అగమ్యం. యావత్‌ రైతాంగానికీ సమగ్ర ఉచిత బీమా రక్షణ ఛత్రం కల్పించి, మోసపూరిత కనీస మద్దతు ధరల యమపాశాల్ని పరిహరించడమే ప్రభుత్వాలు రైతన్నలకు చెయ్యగల మహోపకారం! దానితోపాటు గిడ్డంగులు, శీతల నిల్వ కేంద్రాల వంటివాటిని విరివిగా నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చే చొరవ వచ్చే బడ్జెట్లో ప్రస్ఫుటం కావాలి. ‘జై కిసాన్‌’ నినాదాలు జాతి కడుపు నింపవన్న స్పృహతో రైతాంగానికి గట్టిమేలు తలపెట్టే చర్యలు సత్వరం పట్టాలకెక్కాలి!

బడ్జెట్లో నిధులు తప్పనిసరి...

మహాత్మాగాంధీ పేరు పెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవచిత లక్ష్యాలకు దూరంగా, కొన్ని సందర్భాల్లో రెక్కాడితేనే గాని డొక్కాడని నిరుపేదల పట్ల క్రూర పరిహాసంగా అమలవుతోంది. పని కావాలన్న ప్రతి గ్రామీణ కుటుంబానికీ వంద రోజుల పని, సకాల వేతనాలు అందించాలంటే బడ్జెట్లో రూ.88,000-1,12,000 కోట్లు కేటాయించాలని నిపుణుల అధ్యయనాలు చాటుతున్నాయి. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ.60వేల కోట్ల మొత్తం ఇప్పటికే హరాయించుకుపోగా, వచ్చే రెండు నెలల పరిస్థితి ఏమిటన్న ఆందోళన రాష్ట్రాల్ని వేధిస్తోంది. ప్రతి ఏటా 20శాతం నిధుల్ని పాత బకాయిలకు చెల్లుకొట్టే దుస్థితి పునరావృతం కాకుండా తగినన్ని వనరుల కేటాయింపుపై ఈసారి దృష్టి సారించాలి. గ్రామీణ భారతం అంటే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే కాదు. గ్రామీణ ఉత్పాదకతలో వ్యవసాయం వాటా 39శాతం, తక్కినదంతా తయారీ నిర్మాణ సేవారంగాల సొంతం! అయినా గ్రామీణ శ్రామికుల్లో 64శాతం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. వ్యవసాయేతర శ్రామికుడి ఆదాయంలో మూడోవంతే రైతుకు లభిస్తోందని నీతి ఆయోగ్‌ నివేదికే చెబుతున్నందున మొత్తంగా గ్రామీణుల ఆదాయ స్థితిగతులు మెరుగుపడాలంటే, వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్యను తగ్గించాలి. గ్రామీణ ఉత్పాదకతలో 18శాతం వాటా కలిగిన అక్కడి తయారీ రంగం- ఎనిమిదిశాతం కార్మికులకే ఉపాధి కల్పిస్తోంది. వ్యవసాయానుబంధంతోపాటు ఇతర పరిశ్రమలకూ అనుకూలమయ్యేలా మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారిస్తే గ్రామీణార్థికం తేరుకోవడమే కాదు; దేశ సుస్థిర ప్రగతికి తానే చోదకశక్తిగానూ మారుతుంది!

ఇదీ చదవండి: సీఏఏకు వ్యతిరేకంగా నేడు వయనాడ్​లో రాహుల్ ర్యాలీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 29 January 2020
1. Weinstein exits courthouse
2. SOUNDBITE (English) Harvey Weinstein, former Hollywood producer:
Reporter: "How did it go today, Harvey?"
Weinstein: "It went great today, the lawyers killed it."
POOL - AP CLIENTS ONLY
New York - 29 January 2020
3. Weinstein accuser Tarale Wulff exits court after testimony
4. SOUNDBITE (English) Doug Wigdor, attorney for Tarale Wulff:
"So as far as Ms. Wulff goes, she has no civil claim. She was here for all the right reasons, which was to tell the truth, to help the other women and to hold Harvey Weinstein accountable for his actions."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Doug Wigdor, attorney for Tarale Wulff:
"The points that she (Weinstein's attorney) was trying to make really had no relevancy to whether Ms. Wolf was raped. And Ms. Wulff's testimony about being raped has been consistent from day one. And she showed a lot of courage, she was on the witness stand for a long period of time, and I think she held up on cross-examination extremely well. And I think today really bodes well for the prosecution team."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Doug Wigdor, attorney for Tarale Wulff
"I think it's going well. Like I said, I think today was a great day for the prosecution, I think. And you could see it. I mean, if you were there, you could see it. You could see it on Harvey Weinstein's face, he was not looking happy. You could see it at the end of the day, how angry the defense team was, because they know, they realize that today was not a good day for them."
STORYLINE:
Former Hollywood producer Harvey Weinstein callously preceded an alleged rape with reassurances that he'd had a vasectomy, one of his accusers testified Wednesday.
Choking back tears, former actress Tarale Wulff told jurors she couldn't stop Weinstein as he grabbed her by the arm, pushed her onto a bed and raped her at his New York City apartment in 2005, during what was supposed to be an audition.
Wulff, now 43 and a model, said she froze, thinking that would make it "easier to get through".
Weinstein's lawyers raised doubts about Wulff's recollection after she disclosed that she had worked with a therapist for a year to fill gaps in her memory.
Wulff's attorney, Doug Wigdor, said outside court Wednesday that the defense questions about her memory were irrelevant.
"Ms. Wulff's testimony about being raped has been consistent from day one," he said.
Another accuser testified Wednesday that Weinstein tried trading movie roles for sex, claiming the lewd offer was the kind of thing that happened all the time in the film business.
Dawn Dunning said Weinstein put his hand up her skirt and fondled her during a meeting in his hotel suite about her fledgling acting career.
Wulff and Dunning's experiences with Weinstein are not part of the underlying criminal charges against him, but their testimony could be a factor in whether he goes to prison at the end of his landmark #MeToo-era trial.
Prosecutors called them as witnesses under a state law that allows testimony about so-called "prior bad acts," enabling them to explore things like motive, opportunity, intent and a common scheme or plan.
Weinstein, 67, is charged with forcibly performing oral sex on Mimi Haleyi, at the time a "Project Runway" production assistant, in 2006, and raping another aspiring actress in 2013. That woman could testify later this week.
Weinstein has insisted any sexual encounters were consensual.
As he left court Thursday, he made a rare comment as he passed reporters.
Asked how the day's court session had gone, he replied: "It went great today. The lawyers killed it."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.