మీడియాను నియంత్రించాలనుకుంటే... తొలుత డిజిటల్ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల సమాచారం క్షణాల్లో వైరల్గా మారే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా వివరించింది.
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నియంత్రణకు ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో సమాచారశాఖ స్పష్టం చేసింది. 'సివిల్ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది' అని సుదర్శన్ టీవీ ఛానల్ ప్రోమోలు ప్రసారం చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పటిషన్లపై ఈమేరకు అభిప్రాయం చెప్పింది కేంద్రం.
ఇదీ చూడండి:- ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు జిల్లాకో ప్రత్యేక కోర్టు!