నిర్భయ అత్యాచార ఘటన బాధితురాలి తల్లి ఆశాదేవి దిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోటీ చేస్తున్న దిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో రాజకీయాల్లో పోటీ చేసే విషయమై వివరణ ఇచ్చారు ఆశాదేవి. రాజకీయాల్లోకి రావడం ప్రాధాన్యం కాదని చెప్పారు. నిర్భయ ఘటన దోషులకు శిక్ష పడటమే తన కోరిక అని తెలిపారు.
నిర్భయ దోషులకు శిక్ష వాయిదా పడటం అంశం పైనా స్పందించారు ఆశాదేవి. దోషులు కోరిన విధంగా తేదీలు మార్చుతూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు నిందితులకు కొమ్ముకాసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. దేశంలోని బాలికలకు న్యాయం జరగాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మహాత్మునికి భారతరత్న కోరిన పిటిషన్ తిరస్కరణ