హైదరాబాద్ షాద్‌నగర్ విషాదం నుంచి తేరుకోకముందే ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. మార్చిలో ఆమెపై అత్యాచారం చేసి, బెయిల్‌పై విడుదలైన నిందితుడు... ఆ ఐదుగురు కిరాతకుల్లో ఒకడు.
బిహార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింధ్పుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి శరీరం దాదాపు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆమెను మెరుగైన వైద్యం కోసం లఖ్‌నవూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
"నిందితుల్లో నలుగుర్ని అరెస్ట్ చేశాం. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం. తనను అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇంతకుముందే ఫిర్యాదు చేసింది."
- పోలీసు అధికారి
ప్రియాంక ఆగ్రహం...
"ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టాలు చాలా బాగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తరచూ అసత్యాలు చెబుతున్నారు. కానీ ఆడవారిపై రోజూ జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే గుండె రగిలిపోతోంది. ఇప్పటికైనా భాజపా నాయకులు కళ్లు తెరవాలి."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
- ఇదీ చూడండి: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- 9 మంది మృతి