ETV Bharat / bharat

రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్రుడి పాత్ర ప్రత్యేకం

author img

By

Published : Nov 26, 2019, 10:12 AM IST

డా. రాజేంద్ర ప్రసాద్... రాజ్యాంగ శిల్పి, గొప్ప నాయకుడు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్​లో బిహార్​ నుంచి ఎంపికైన 36 మంది సభ్యుల్లో ఆయన ఒకరు. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో డా. రాజేంద్ర ప్రసాద్​ పాత్రపై ప్రత్యేక కథనం.

indian constitution assembly first president
రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్రుడి పాత్ర ప్రత్యేకం

ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతిపెద్దది. ఎంతోమంది దార్శనిక నాయకులు రాజ్యాంగ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించారు. అందులో ముఖ్యనేత భారత తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్.

భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్​లో బిహార్​ నుంచి ఎంపికైన 36 మంది సభ్యుల్లో రాజేంద్ర ఒకరు. 1946 డిసెంబర్​ 11న రాజ్యాంగ పరిషత్​కు ఆయన శాశ్వత అధ్యక్షుడి​గా నియమితులయ్యారు.

రావాల్సిన పేరు రాలేదు...

డా. రాజేంద్ర ప్రసాద్​ మనుమరాలు తారా సిన్హా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్​ పాత్రపై ఎవరూ ఇప్పటివరకు చర్చించలేదన్నారు.

రాజేంద్ర ప్రసాద్​ మార్గదర్శకాల ద్వారా భారత రాజ్యాంగం 3 ఏళ్ల లోపు విజయవంతంగా రూపుదిద్దుకుందని తెలిపారు తార. రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్రప్రసాద్ పాత్ర ఎనలేనిదన్నారు. అయితే సాధారణ జనంలో చారిత్రక రాజ్యాంగ నిర్మాణానికి పడ్డ శ్రమపై అంత అవగాహన లేదని అభిప్రాయపడ్డారు.

భారత రాజ్యాంగ నిర్మాతగా... కీర్తి గడించాల్సిన రాజేంద్ర ప్రసాద్​... ఆ పుస్తకం గురించి చర్చించేటప్పుడు మాత్రమే గుర్తుకు రావడం బాధాకరమన్నారు ఆయన మనుమరాలు.

ఆయనే ప్రధాన వ్యక్తి...

రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు అందులో సమానత్వాన్ని ఇనుమడింపజేయడంలో ఎదురైన సవాళ్లు, వాటిని రాజేంద్ర అధిగమించిన తీరును రాజకీయ విశ్లేషకుడు, ఏఎన్ సిన్హా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సోషల్ స్టడీస్​ మాజీ డైరక్టర్​ డీఎమ్​ దివాకర్​​ ప్రస్తావించారు.

"రాజ్యాంగంలో సమానత్వం తీసుకురావడంలో డా.రాజేంద్ర ప్రసాద్​ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేం. వర్తమాన, భవిష్యత్​ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని సమగ్రంగా తయారు చేశారంటే అది కేవలం డా. రాజేంద్ర ప్రసాద్​ కృషి వల్లే."
- డీఎమ్​ దివాకర్​​, రాజకీయ విశ్లేషకుడు

రాజ్యాంగ నిర్మాణంలో కీలక నిర్ణయాలు, చట్టాల రూపకల్పనలో డా. రాజేంద్ర ప్రసాద్​ పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు దివాకర్​.

రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్​ చేసిన కృషి మిగిలిన అందరి కన్నా గొప్పదని 'రాజేంద్ర మెమోరియల్ మ్యూజియం' ఛైర్మన్​ మనోజ్​ వర్మ అభిప్రాయపడ్డారు.

రాజేంద్ర సారథ్యంలో ఇలా...

1946 డిసెంబర్​ 9న రాజ్యాంగ పరిషత్​ తొలి సమావేశం జరిగింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశం నిర్వహించి రాజ్యాంగానికి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారు. ఏక పౌరసత్వం, రాష్ట్రపతి, స్పీకర్​, ఉప స్పీకర్​ పదవులు, ప్రొవిజినల్​ పార్లమెంటు తక్షణం అమల్లోకి వచ్చాయి.

1950 జనవరి 26న భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

292 రాజ్యాలు, 93 రాష్ట్రాలు, 3 ప్రధాన కమిషనర్​ రాజ్యాలు, బలూచిస్థాన్​ నుంచి మొత్తం 389 మంది భారత అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు.

అయితే ప్రత్యేక దేశం కోరుతూ ముస్లిం లీగ్​ సభ్యుల ఉపసంహరణతో అసెంబ్లీ సంఖ్య 299కి చేరింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid training facilities, Valdebebas, Madrid, Spain. 25th November 2019.
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
Zinedine Zidane said he 'is in love with Mbappe' when asked about the France's international on the eve of facing PSG in the Champions League, while goalkeeper Thibaut Courtois considered Gareth Bale's totally committed to the team.
The Spanish side were beaten 3-0 when both teams played in Paris in Round 1, with 'Los Blancos' hoping to avenge that defeat.
The French side lead Group A with 12 points, with Real trailing them by five points.
A victory for Real Madrid will qualify them to the knock-out stages and will put pressure to PSG to finish on top of the group.
PSG, who had already qualified for the next round, will secure top group if they avoid defeat.
Real Madrid have won three out of four matches played in Madrid between both sides, with their only defeat happening in 1994.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.