ETV Bharat / bharat

కోటా: ఒకే నెలలో 91మంది చిన్నారులు మృతి - rajasthan kota child deaths reason was uncleanley ness

అప్పుడే పుట్టిన పసికందు, రోజుల వ్యవధిలో జన్మించిన శిశువు, 2 నెలల చిన్నారి.. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 14 మంది పసిపిల్లలు రాజస్థాన్​ కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్‌ నెలలో మృతిచెందిన చిన్నారుల సంఖ్య 91. ఆసుపత్రిలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని జాతీయ శిశు హక్కుల కమిషన్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో శిశు మరణాలపై సమగ్ర కథనం.

kota
'కోటా' శిశు మరణాలకు కారణం అపరిశుభ్రతే!
author img

By

Published : Dec 31, 2019, 5:41 AM IST

Updated : Dec 31, 2019, 7:48 AM IST

కోటా: ఒకే నెలలో 91మంది చిన్నారులు మృతి

గత కొద్ది రోజులుగా రాజస్థాన్ కోటాలోని జేకే లాన్‌ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులు మృతి చెందుతున్నారు. ఆదివారం మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత వారంలో ఇక్కడ మరణించిన శిశువుల సంఖ్య 14 కు చేరింది. కేవలం డిసెంబరు నెలలోనే ఈ ఆసుపత్రిలో 91 మంది చిన్నారులు మృతిచెందగా.. ఈ ఏడాది వీరి సంఖ్య 940గా ఉంది.

శిశు మరణాలపై కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ట్విట్టర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాజస్థాన్‌ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కూడా ఈ మరణాలపై తీవ్రంగా స్పందించారు. శిశు మరణాలపై రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి వైభవ్‌ గాల్రియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

'అపరిశుభ్రతే'-దర్యాప్తు నివేదిక

ఆసుపత్రి మౌలిక సదుపాయాల్లో అనేక లోపాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది ముగ్గురు సభ్యుల కమిటీ. చిన్నారులను ఉంచే నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(నవజాత శిశు విభాగం)లో సరిపడా ఆక్సిజన్‌ ఉండట్లేదని గుర్తించింది. ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రతతో మునిగి తేలుతోందని, పందులు స్వైర విహారం చేస్తున్నట్లు ఎన్​సీపీసీఆర్ పేర్కొంది. విరిగిన తలుపులు,కిటికీలు, సిబ్బంది కొరతతో ఆసుపత్రి సమస్యల సుడిలో ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టం చేసింది.

వైద్య పరికరాలు తక్కువే

వైద్యానికి అవసరమైన పరికరాలు కూడా ఆసుపత్రిలో అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి మౌలిక సదుపాయాలపై జాతీయ శిశు హక్కుల కమిషన్‌ ఎన్​సీపీసీఆర్ చేసిన దర్యాప్తులో ఆశ్చర్యపోయే నిజాలు బహిర్గతమయ్యాయి.

పెద్ద దిక్కు.. అయినా

కోటా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పిల్లల పరిస్థితి విషమంగా ఉంటే స్థానిక వైద్యులు ఈ ఆసుపత్రినే సూచిస్తారు. ఈ విధంగా విషమంగా ఉన్న వారితో సహా రోజూ చాలా మంది చిన్నారులను వైద్యం కోసం ఇక్కడకు తీసుకొస్తారు. అలాంటి ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు, సదుపాయాలు లేకపోవడం అధికారుల నిర్వహణ లోపానికి అద్దం పడుతోంది.

'వైద్యుల నిర్లక్ష్యం కాదు'

మరోవైపు చిన్నారుల మరణాలకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వస్తున్న ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. ఇక్కడ చిన్నారుల మరణాలు అసాధారణమేమీ కాదని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పిల్లల పరిస్థితి దాదాపు చేయిదాటిన తర్వాతే ఇక్కడకు తీసుకొస్తారని.. అలాంటి సమయంలో వైద్యులు కూడా ఏమీ చేయలేరని పిడియాట్రిక్‌ విభాగ అధిపతి డాక్టర్‌ అమృత్‌ లాల్‌ పేర్కొన్నారు.

'కోటా' చుట్టూ రాజకీయం

కోటా ప్రభుత్వాస్పత్రిలో చిన్నారుల మరణాలు రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు.అశోక్‌ గెహ్లోత్ ప్రభుత్వ వైఫల్యమే చిన్నారుల మరణాలకు కారణమని విపక్ష భాజపా ఆరోపించింది. తాము అధికారంలో ఉన్నప్పుడు శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించామని పేర్కొంది. అదే సమయంలో ఈ మరణాలపై దర్యాప్తు కోసం భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నలుగురు ఎంపీల కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: 'కోటా'లో పిల్లల మరణాలపై చర్యలు తీసుకోండి: ఓం బిర్లా

SNTV Monthly Prospects
January 2020
Here is SNTV's proposed coverage of events and sports in the coming month. Please note there will be additions made to this list on a daily basis and some items may be subject to change.
Please watch daily prospects for further details.
SOCCER:
English Premier League – previews and reaction from selected matches
FA Cup
Arabian Gulf League
Dutch Eredivisie
French Ligue 1 – news
German Bundesliga
Greek Superleague
Italian Serie A
J.League
Portuguese Primeira Liga
Qatar Stars League
Scottish Premiership
Spanish La Liga – news
GOLF:
PGA Tour:
Sentry Tournament of Champions, Hawaii.
Sony Open, Hawaii.
The American Express, California.
Farmers Insurance Open, California.
Waste Management Phoenix Open, Arizona.
European Tour:
Abu Dhabi HSBC Championship presented by EGA, Abu Dhabi.
Omega Dubai Desert Classic, Abu Dhabi.
Saudi International Powered by SBIA, Saudi Arabia.
LPGA Tour:
Diamond Resorts Tournament of Champions, Florida.
Gainbridge LPGA At Boca Rio, Florida.
TENNIS:
Australian Open
ATP Cup
ATP Tour
WTA Tour
MOTORSPORT:
FIA Formula E: 2020 Antiofagasta Minerals Santiago E-prix, Santiago.
FIA World Rally Championship, Monte-Carlo.
X-Trial Championship, Budapest.
Rolex 24 at Daytona, Daytona, United States of America.
Dakar Rally, Saudi Arabia.
CYCLING:
UCI Track Cycling World Cup, Canada.
RUGBY:
HSBC world rugby seven series, New Zealand.
WINTER SPORT:
FIS Alpine Ski World Cup
FIS Cross-Country World Cup
FIS Nordic Combined World Cup
FIS Ski Jumping World Cup
FIS Snowboard World Cup
Alpine Skiing World Cup
Ski Jumping World Cup
VARIOUS:
AMERICAN FOOTBALL: NFL
BASKETBALL: Euroleague
BASKETBALL: NBA
ICE HOCKEY: NHL
Squash PSA World Tour
Last Updated : Dec 31, 2019, 7:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.